Chiyaan Vikram: త్రీడీలోనూ చియాన్ విక్రమ్ చిత్రం..

Chiyaan 61: Vikram And Pa Ranjith Movie In 3D Version - Sakshi

Chiyaan 61: Vikram And Pa Ranjith Movie In 3D Version: విభిన్నమైన పాత్రలతో, సినిమాలతో అటు కోలీవుడ్‌నే కాకుండా ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే హీరో చియాన్ విక్రమ్‌. వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ అందులో జీవించేస్తారు. ఇటీవల కొడుకు ధ్రువ్‌తో కలిసి మహాన్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్‌ 'కోబ్రా', 'పొన్నియన్‌ సెల్వన్ పార్ట్‌ 1' సినిమాల్లో నటిస్తున్నారు. ఇవే కాకుండా విక్రమ్‌ హీరోగా మరో క్రేజీ సినిమా రానుంది. 

దర్శకుడు పా. రంజిత్‌ కాంబినేషన్‌లో విక్రమ్‌ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్‌ను ఈ నెలలోనే ఆరంభించాలనుకుంటున్నారు. 18వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందట. ఈ సినిమాను దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అంతేకాదు.. త్రీడీ వెర్షన్‌ను కూడా చిత్రీకరించాలనే యోచనలో ఉన్నట్లు చిత్రనిర్మాత జ్ఞానవేల్‌ రాజా పేర్కొన్నారు. ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌లోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని కూడా జ్ఞానవేల్‌ రాజా పేర్కొన్నారు.   

చదవండి: తొలిసారిగా మోహన్‌ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్‌.. టైటిల్ ఫిక్స్‌
నా రిలేషన్‌ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్‌

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top