అల్లు రామలింగయ్య నాకు కూడా వైద్యం చేశారు: చిరంజీవి | Chiranjeevi About Allu Ramalingaiah Statue Unveiling At Rajamundry | Sakshi
Sakshi News home page

Chiranjeevi : 'హోమియోపతితో నా సమస్యను పూర్తిగా నయం చేశారు'

Oct 1 2021 1:30 PM | Updated on Oct 1 2021 4:18 PM

Chiranjeevi About Allu Ramalingaiah Statue Unveiling At Rajamundry - Sakshi

Chiranjeevi At Allu Ramalingaiah Statue Unveiling : అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి రాజమండ్రిలో పర్యటించారు. అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రాజమండ్రితో తనకు అనుబంధం ఉందని, అసలు మేకప్‌ వేసుకుందే రాజమండ్రిలో అని పేర్కొన్నారు.

'అల్లు రామలింగయ్యకు, నాకు గురు శిష్యుల అనుబంధం ఉంది. అల్లు రామలింగయ్య బహుముఖ ప్రఙ్ఞాశాలి. నటుడిగా కొనసాగుతూనే ఆయన హోమియోపతిపై పట్టు సాధించారు. నిత్య విద్యార్థిలానే అల్లు రామలింగయ్య ఎంతో కష్టపడ్డారు. ఎంతో మంది సేవ చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్‌ వంటి సినీ ప్రముఖులు సహా ఎంతోమందికి ఆయన చికిత్స అందించారు.

ఓసారి నేను కడుపునొప్పితో బాధపడుతుంటే ఆయన హోమియోపతి చికిత్సతో దాన్ని పూర్తిగా నయం చేశారు. ఇంతవరకు నాకు మళ్లీ ఆ సమస్య ఎదురుకాలేదు.ఇప్పటికీ నాతో పాటు నా పిల్లలు, వాళ్ల పిల్లలు కూడా హోమియోపతిని ఫాలో అవుతున్నాం' అని చిరంజీవి పేర్కొన్నారు. 

చదవండి: అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్

Advertisement
 
Advertisement
Advertisement