గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి? | Chinnadana Neekosam Movie Actress Mishti Chakravarty Latest Pic | Sakshi
Sakshi News home page

Guess The Actress: అప్పుడు బొమ్మలా ఉండేది.. కానీ ఇప్పుడేమో ఇలా!

Jun 22 2024 2:20 PM | Updated on Jun 22 2024 3:00 PM

Chinnadana Neekosam Movie Actress Mishti Chakraborty Latest Pic

కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నిండుగా అందంగా చూడటానికి చాలా బాగుంటారు. కానీ ఆ తర్వాత ఏమవుతుందో ఏమో గానీ ఫ్యాషన్ పేరిట ఎలానో మారిపోతారు. కొన్నిసార్లు అయితే వాళ్లని చూసి ఇంతకీ ఎవరీమే అని అనుకునేంతలా మారిపోయి కనిపిస్తారు. తాజాగా ఓ హీరోయిన్ అలానే అయిపోయింది. ఈమె తెలుగులో కొన్ని మూవీస్ చేసిన బ్యూటీ. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: కాబోయే భర్తకు కాస్ట్ లీ కారు గిఫ్ట్ ఇచ్చిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి)

పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు మిస్తీ చక్రవర్తి. కలకత్తాలో పుట్టి పెరిగిన ఈమె.. 2013లో 'పొరిచోయ్' అనే బెంగాలీ మూవీతో నటిగా మారింది. ఆ తర్వాత ఏడాదే తెలుగులో నితిన్ 'చిన్నదాన నీకోసం', హిందీలో 'కాంచీ' మూవీస్‌లో హీరోయిన్‌గా చేసింది. తెలుగు చిత్రం హిట్ కానప్పటికీ మిస్తీకి కాస్త గుర్తింపు వచ్చింది. దీని తర్వాత తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. కానీ ఈమెకు పెద్దగా బ్రేక్ అయితే రాలేదు.

గతేడాది 'ఓ సాథియా' అనే తెలుగు మూవీలో చివరగా నటించింది. దీని తర్వాత కొత్త ఛాన్సులైతే ఈమెకు వస్తున్నట్లు లేవు. దీంతో గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ దర్శక నిర్మాతలని ఆకర్షించే పనిలో ఉంది. కెరీర్ ప్రారంభంలో ముద్దుగా, అందంగా ఉన్న మిస్తీ.. ఫ్యాషన్ పేరు చెప్పి మరీ గుర్తుపట్టలేనంతగా తయారైంది. రీసెంట్‌గా ఈమె ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తే కచ్చితంగా అలానే అనిపించొచ్చు. ప్రస్తుతం ఈమె వయసు 36 ఏళ్లు. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో ఏమో?

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement