ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? | Here's how much Prabhas, Deepika Padukone, Amitabh Bachchan, Kamal Haasan and others charged for Kalki 2898 A.D. | Sakshi
Sakshi News home page

Prabhas Kalki Remuneration: ప్రభాస్‌కి ఏకంగా అన్ని కోట్ల పారితోషికమా?

Published Sat, Jun 22 2024 10:05 AM | Last Updated on Sat, Jun 22 2024 11:33 AM

Prabhas And Kalki Movie Actors Remuneration Details

'కల్కి' రిలీజ్‌కి మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరీ ఓ రేంజ్‌లో కాకపోయిన ఓ మాదిరి హైప్ ఉంది. ఇప్పటికే రిలీజైన రెండు ట్రైలర్స్ సూపర్‌గా ఉన్నాయి. కానీ మూవీ టీమ్ ప్రమోషన్స్ మాత్రం కాస్త తక్కువగానే చేస్తోందనేది నెటిజన్ల నుంచి వినిపిస్తున్న మాట. ఎవరెమనుకున్నా సరే ఒక్కసారి సినిమా క్లిక్ అయితే జనాలు ఇవేవి పట్టించుకోరు. సరే ఇదంతా వదిలేస్తే ఇప్పుడు 'కల్కి' రెమ్యునరేషన్స్ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి.

'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. అందుకు తగ్గట్లే నిర్మాతలు కూడా వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. అలా 'కల్కి'ని ఏకంగా రూ.700 కోట్ల బడ్జెట్‌తో తీశారనే టాక్ నడుస్తోంది. ట్రైలర్‌లో విజువల్స్ చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?)

అయితే మొత్తం బడ్జెట్‌ అంతా సినిమా కోసమే ఖర్చు చేయరు కదా! ఇందులో రెమ్యునరేషన్స్ కూడా ఉంటాయి. అలా హీరోగా చేసిన ప్రభాస్‌కి రూ.150 కోట్ల వరకు ఇచ్చారట. ఇక ఇతర కీలక పాత్రలు చేసిన అమితాబ్, కమల్‌కి తలో రూ.20 కోట్లు ఇచ్చారని సమాచారం. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ కలిసి మరో రూ.60 కోట్ల వరకు ఖర్చయిందట.

దీనిబట్టి చూస్తే మొత్తం బడ్జెట్‌లో రూ.250 కోట్ల వరకు పారితోషికాలకే అయిపోయినట్లు అనిపిస్తుంది. అంటే మిగిలిన రూ.450 కోట్ల బడ్జెట్‌తో మూవీ తీశారనమాట. ఏదేమైనా సంక్రాంతి తర్వాత భాక్సాఫీస్ డల్లుగా ఉంది. 'కల్కి' గనక హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్స్ మోత మోగిపోవడం గ్యారంటీ. మరి మీలో ఎంతమంది 'కల్కి' కోసం వెయిట్ చేస్తున్నారు?

(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement