సినిమా తియ్యడం అనేది మనిషి పుట్టుకతో సమానం: నాగ్‌ అశ్విన్‌ | Cheddi Gang Thamasha Movie Teaser Launched By Nag Ashwin | Sakshi
Sakshi News home page

సినిమా తియ్యడం అనేది మనిషి పుట్టుకతో సమానం: నాగ్‌ అశ్విన్‌

Nov 12 2022 3:53 PM | Updated on Nov 12 2022 3:53 PM

Cheddi Gang Thamasha Movie Teaser Launched By Nag Ashwin - Sakshi

సినిమాలలో చిన్న, పెద్ద అనే తేడా ఉండదు. కంటెంట్‌ బాగుంటే ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం  అంటే మనిషి పుట్టుకతో  సమానం. ఒక తల్లి గర్భం దాల్చి నవమాసాలు మోసి జన్మించే వరకు పడే తపనే  సినిమా’అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అన్నారు. అబుజా ఎంటర్‌టైన్‌మెంట్‌ ,  శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘చెడ్డి గ్యాంగ్‌ తమాషా’. గాయత్రి పటేల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని యంగ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ విడుదల చేశారు. అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ..  ‘చెడ్డి గ్యాంగ్ తమాషా"టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా టీజర్ చూస్తుంటే యంగ్ టీం తో మేము తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా లాగే ఈ ‘చెడ్డి గ్యాంగ్ తమాషా’  సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని అన్నారు. 

కొత్త టీంతో మేం  తీసిన ఈ సినిమా  కంటెంట్ నాలుగు గంటలు  వస్తే దానిని  2 గంటల 40 నిమిషాలకు తగ్గించడానికి మేము చాలా గర్భ శోకను అనుభవించాం. మంచి కథతో  తీసిన  ఈ సినిమా ప్రతి ఒక్కరికీ  కచ్చితంగా నచ్చుతుంది​’ అని నిర్మాత క్రాంతి కిరణ్‌  అన్నారు. ‘నటుడు అవ్వాలనే మా అమ్మ కోరికతో ఇండస్ట్రీ వచ్చాను. ఈ సినిమాతో నా 15 ఏళ్ల కల నెరవేరింది. అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా ‘చెడ్డి గ్యాంగ్‌ తమషా’ చిత్రం ఉంటుంది’అని హీరో, దర్శకుడు వెంకట్‌ కళ్యాణ్‌ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement