సిల్క్‌ స్మిత మరో బయోపిక్‌.. హీరోయిన్‌ ఎవరంటే..? | Chandrika Ravi To Play Lead Role In Silk Smitha's Biopic | Sakshi
Sakshi News home page

సిల్క్‌ స్మిత మరో బయోపిక్‌.. హీరోయిన్‌ ఎవరంటే..?

Dec 2 2023 2:45 PM | Updated on Dec 2 2023 3:00 PM

Chandrika Ravi Play Lead Role In Silk Smitha Biopic - Sakshi

సిల్క్‌ స్మిత.. సినీ ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయే పేరు ఇది. ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారును ఉర్రుతలూగించింది. చనిపోయి పాతికేళ్లు దాటినా..ఇప్పటికే సిల్క్‌ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతూనే ఉంది. ఇప్పటికే ఈ శృంగార తారపై బాలీవుడ్‌లో డర్టీ పిక్చర్‌ అనే సినిమా వచ్చింది. తాజాగా మరో సిల్క్‌ జీవితం ఆధారంగా మరో చిత్రం రాబోతుంది.  చంద్రికా రవి ప్రధాన పాత్రలో నటిస్తోన ఈ చిత్రాన్ని జయరామ్‌ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

(చదవండి: ఊహించని పేరు, డబ్బు.. చివరి క్షణాల్లో నరకం.. ‘ఐటమ్‌ గర్ల్‌’ విషాద గాథ)

సిల్క్‌ స్మిత- ది అన్‌టోల్డ్‌ స్టోరీ అనే టైటిల్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శనివారం(డిసెంబర్‌ 2) సిల్క్‌ స్మిత జయంతిని పురస్కరించుకొని ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఇందులో చంద్రిక..అచ్చం స్మితలా కనిపించింది. 

ఎవరీ రవి చంద్రికా!
భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ మోడల్, నటి చంద్రికా రవి. ‘చీకటి గదిలో చితకొట్టుడు’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ‘వీర సింహారెడ్డి’ సినిమాలో 'మా మనోభావాలు దెబ్బ తిన్నాయి'పాటకు బాలయ్యతో కలిసి స్టెప్పులేసింది. ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే.. సిల్క్‌ పాత్రలో రవి చంద్రికా ఒదిగిపోయినట్లు కనిపిస్తుంది. సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా ఇప్పటికే బాలీవుడ్‌లో  డర్టీ పిక్చర్‌ వచ్చింది. అందులో స్మిత జీవితం మొత్తాన్ని చూపించారు. అంతకు మించి ఈ చిత్రంలో కొత్తగా ఏం చూపిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement