Vyuham: ఆర్జీవీ వ్యూహానికి తొలగిన అడ్డంకులు | Censor Board Clear For RGV's Vyuham Movie, Release Date Fixed | Sakshi
Sakshi News home page

బ్యాడ్‌ న్యూస్‌ ఫర్‌.. ఆర్జీవీ వ్యూహానికి తొలగిన అడ్డంకులు

Dec 13 2023 8:32 PM | Updated on Dec 14 2023 10:50 AM

Censor Clear For RGV Vyuham Movie Release Date Fixed - Sakshi

రాం గోపాల్‌ వర్మ ‘వ్యూహం’ రిలీజ్‌కు అడ్డంకులు తొలిగాయి. సినిమాకు యూ సర్టిఫికెట్‌ ఇచ్చింది సెన్సార్‌ బోర్డ్‌. ఈ విషయాన్ని ఆర్జీవీ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా స్వయంగా పంచుకున్నారు. ఈ నెల 29వ తేదీన సినిమా రిలీజ్‌ కానున్నట్లు ప్రకటించారాయన. 

ఇక సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ లభించడంపై వర్మ తనదైన స్టైల్‌లో స్పందించారు. బ్యాడ్‌ న్యూస్‌ ఫర్‌ బ్యాడ్‌ గాయ్స్‌ అంటూ ఎక్స్‌లో సందేశం ఉంచారాయన. 


వర్మ డైరెక్షన్‌లో అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’.  ఈ సినిమాను అడ్డుకునేందుకు కొందరు విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ సెన్సార్ బోర్డుకు లేఖ సైతం రాశారు. ఆ సమయంలో ఆర్జీవీ తీవ్ర స్థాయిలోనే స్పందించారు.  

‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్‌కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని ఛాలెంజ్‌ను స్వీకరించారాయన.

ఇదీ చదవండి- ‘వ్యూహం’ ఏ పార్టీకి చెందింది కాదు.. కేవలం.. : ఆర్జీవీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement