‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్ర యూనిట్‌పై కేసు

Case Filed On Ippudu Kaaka Inkeppudu Movie Team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్ర యూనిట్‌పై నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఇటీవల విడుదలైన దీని టీజర్‌ను పరిశీలించిన అధికారులు ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసే సన్నివేశం ఉన్నట్లు గుర్తించారు.

కథానాయకుడు, నాయికలకు సంబంధించిన సన్నివేశంలో బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌గా ఓ భక్తి గీతాన్ని వినిపించారు. ఇది తీవ్ర అభ్యంతరకరమనే వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వెలువడ్డాయి. దీంతో ఆ ట్రైలర్‌ను వీక్షించిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చిత్ర యూనిట్‌పై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో ఆ యూనిట్‌కు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top