నటుడిగా నాలో మరో యాంగిల్‌ను చూస్తారు: సంపూర్ణేష్‌ బాబు

Burning Star Sampoornesh Babu About Bazaar Rowdy Movie - Sakshi

సంపూర్ణేష్‌ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘బజార్‌ రౌడీ’. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లోరాని, మహేశ్వరి హీరోయిన్లు. బోడెంపూడి కిరణ్‌ కుమార్‌ సమర్పణలో సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్‌ మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకు నాలుగు (‘హృదయకాలేయం, కొబ్బరిమట్ట, సింగం 123, వైరస్‌’) సినిమాలు చేశాను. ‘బజార్‌ రౌడీ’ ఐదో చిత్రం.

నా గత చిత్రాలు ఒక ఎత్తు అయితే ‘బజారు రౌడీ’ మరో ఎత్తు. ఈ సినిమా నా జర్నీకి మరో మెట్టు అవుతుంది’’ అని అన్నారు. ‘‘నటుడిగా సంపూర్ణేష్‌లో మరో యాంగిల్‌ను చూస్తారు’’ అన్నారు నాగేశ్వరరావు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అన్నారు శ్రీనివాసరావు. ‘‘సంపూర్ణేష్‌ కెరీర్‌లో ఈ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రాకేష్‌. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top