గీతగోవిందం వసూళ్లను విరాళంగా ఇచ్చాం, అందుకేనేమో! | Bunny Vasu Speech At 2018 Movie Success Meet | Sakshi
Sakshi News home page

అప్పుడు గీతగోవిందం వసూళ్లను విరాళంగా.. ఇప్పుడేమో

May 29 2023 3:44 AM | Updated on May 29 2023 7:21 AM

Bunny Vasu Speech At 2018 Movie Success Meet - Sakshi

టోవినో థామస్, బన్నీ వాసు

‘‘గీతగోవిందం’ సినిమాను కేరళలో విడుదల చేసి, వసూళ్లను అక్కడ విరాళంగా ఇచ్చాం(కేరళలో 2018 వచ్చిన వరదలను ఉద్దేశిస్తూ). బాహుశా.. అందుకేనేమో మలయాళ హిట్‌ మూవీ ‘2018’ ని తెలుగులో విడుదల చేసే అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్‌ వేణు, ఆంథోనీ, పద్మ కుమార్‌గార్లకు థ్యాంక్స్‌. హృదయాన్ని హత్తుకునే సినిమా ‘2018’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. టోవినో థామస్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘2018’.

జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో ఈ నెల 3న రిలీజైంది. ఈ మూవీని ఈ నెల 26న తెలుగులో ‘బన్నీ’ వాసు విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ‘2018’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో టోవినో థామస్‌ మాట్లాడుతూ–‘‘ఇకపై నేను నటించే సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాని థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌. ఈ కార్యక్రమంలో అపర్ణా బాలమురళి, నిర్మాత ఎస్‌కేఎన్‌  పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement