‘బ్రాందీ డైరీస్’ ఆగష్టు 13న విడుదల 

Brandy Diaries Movie Released On August 13th World Wide - Sakshi

కలెక్టివ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు రచన, దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాందీ డైరీస్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. వ్యక్తిలోని వ్యసన స్వభావం, దానివల్ల వచ్చే సంఘర్షణతో, సహజమైన సంఘటనలు, సంభాషణలు, పరిణతి ఉన్న పాత్రలతో  కొత్త నటీనటులతో నాచురల్ లోకేషన్స్‌లో, సహజత్వానికి పట్టంకడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించింది. ఈ శుక్రవారం విడుదల అవుతోంది. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ ‘నా సొంత ఊరు గుంటూరు జిల్లా చిలకలూరిపేట దగ్గర తిమ్మాపురం.  చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. బాగా చదువుకున్నాను. సివిల్స్కి కూడా ప్రిపేర్ అయ్యాను. కానీ సినిమా పరిశ్రమలోకి రావాలి అనే తపన బలంగా ఉంది. ప్రతిరోజూ ఏదొక సినిమా చూసేవాడిని. అసిస్టెంట్ కమీషనర్ అఫ్ టాక్స్ ఆఫీసర్‌గా పని చేశాను. సినిమా కథలు రాసుకోవటానికి సమయం సరిపోవటం లేదు అని ఆ ఉద్యోగం మానేసి జూనియర్ లెక్చరర్‌గా హిస్టరీ పాఠాలు చెబుతూ... నా సినిమాలోకంలో ఉండే వాడిని. ఈరోజుల్లో సినిమా తీసి మెప్పిచడం చాలా కష్టం. ప్రపంచంలో అన్ని భాషల సినిమాలు ఇప్పుడు ఓ టి టి ద్వారా చూడొచ్చు. నేను కూడా కొత్తగా సినిమా చేయాలని... అది ప్రతి ప్రేక్షకుడికి టచ్ అవ్వాలని.. అని ఈ ‘బ్రాందీ డైరీస్’ సినిమా కథ రాసుకున్నా. ప్రస్తుతం ప్రపంచం అంత ఆల్కహాల్ చుట్టు తిరుగుతుంది. ఇలాంటి కథ ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది అని ఈ సినిమా చేశాను. 

‘బ్రాందీ డైరీస్’ టైటిల్... కథకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. ఇది పూర్తిగా వినోద భరితమైన సినిమా. ఎటువంటి సందేశం కానీ లెక్చర్ కానీ లేదు. రెండు గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా. ఈ చిత్రంలో ఆల్కహాలే హీరో. మిగతా వాళ్లంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు మాత్రమే. కానీ ఆల్కహాల్ మంచి హీరోనా? చెడ్డ హీరోనా? అని తెలుసుకోవాలని ఉంటే ‘బ్రాందీ డైరీస్’ చిత్రం  చూడాల్సిందే. నా సినిమాలో అందరూ కొత్తవాళ్లే, కొత్త నటులు, సీనియర్ రంగస్థల నటులు ఉన్నారు. గుంటూరు, పాలకొల్లు, రాజమండ్రి, శ్రీకాకుళం లాంటి ఊళ్లల్లో మంచి ప్రతిభ ఉన్న రంగస్థల నటులున్నారు. వాళ్లకి ఈ చిత్రం మంచి అవకాశం కల్పించింది. సెన్సార్ వాళ్లు క్లీన్ ఫిల్మ్ అన్నారు. ఆల్కహాల్ ఉంది కాబట్టి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.  ఆగష్టు 13న రిలీజ్ అవుతుంది. మొత్తం 130 థియేటర్లలో విడుదల అవుతుంది. కర్ణాటకలో 30 థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top