Brahmastra Director Ayan Mukerji Clarity On Alia Bhatt Ranbir Kapoor Remuneration - Sakshi
Sakshi News home page

Brahmastra: ఆలియాభట్, రణ్‌బీర్‌ కపూర్‌ రెమ‍్యునరేషన్‌పై రూమర్లు.. డైరెక్టర్ క్లారిటీ

Published Fri, Sep 23 2022 4:09 PM | Last Updated on Fri, Sep 23 2022 7:58 PM

Brahmstra Director  Ayan Mukerji  Clarity On Alia Bhatt Ranbir kapoor Remunaration - Sakshi

బాలీవుడ్ రొమాంటిక్ జోడీ ఆలియాభట్‌, రణ్‌బీర్ కపూర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఇటీవల విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సాధించింది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనిరాయ్‌ కీలక పాత్రల్లో పోషించారు. అయితే ఈ సినిమా బడ్జెట్‌, కలెక్షన్స్‌ విషయంలో పలు రకాల వదంతులు వ్యాపించాయి. ఈ సినిమా బడ్జెట్‌ పెరిగడంతో.. అలియాభట్, రణ్‌బీర్ కపూర్‌‌ రెమ్యునరేషన్ తీసుకోలేదనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై తాజాగా  సినిమా దర్శకుడు అయాన్‌ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు.

అయాన్‌ ముఖర్జీ మాట్లాడుతూ ‘చాలా మంది త్యాగాలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమాలో నటించినందుకు రణ్‌బీర్‌ ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అలియాభట్  ఈ ప్రాజెక్టులో 2014లో జాయినైంది. ఆమెకు ఈ చిత్రానికి ఇచ్చిన పారితోషికం ప్రస్తుతం తాను తీసుకుంటున్న దానికి చాలా తక్కువ.  మేం సినిమా పూర్తి చేసే సమయానికి అలియా కూడా  ఈ చిత్రంలో భాగమైంది’ అని అన్నారు. 

(చదవండి: బిగ్‌బాస్‌ షో.. ఆ స్టార్‌ హీరో పారితోషికం భారీగా తగ్గనుందా..!)

రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తలపై రణ్‌బీర్‌ కపూర్ కూడా స్పష్టత ఇచ్చారు.  ఆయన మాట్లాడుతూ.. ‘ నిజానికి నేను బ్రహ్మాస్త్ర మొదటి భాగానికి పారితోషికం తీసుకోలేదు. ఎందుకంటే నేను ఈ చిత్రానికి నిర్మాతను కూడా. కానీ నేను అంతకు మించి పొందాను. ఈ సినిమాను మూడు భాగాలుగా తీయగలమనే నమ్మకం ఉంది. ఒక నటుడిగా నేను ఇంతకంటే పొందగలిగేది ఏముంటుంది. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను’’ అని అన్నారు. 


 "
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement