68 ఏళ్ల‌ వ‌య‌సులో శ్రీదేవి భ‌ర్త‌ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌ | Boney Kapoor Undergoes Hair Transplant Surgery To Look Better, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Boney Kapoor Hair Transplant Surgery: బ‌ట్ట‌త‌ల‌.. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చేయించుకున్న శ్రీదేవి భ‌ర్త‌

Published Fri, Feb 23 2024 5:19 PM

Boney Kapoor Undergoes Hair Transplant Surgery - Sakshi

ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌ జుట్టు ఊడ‌టం. ఎన్నిర‌కాల ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలు చేసినా జుట్టు కాపాడుకోవ‌డం గ‌గ‌న‌మైపోతోంది. చిన్న‌పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రికీ ఇదే ప‌రిస్థితి. ఇక వ‌య‌సు పైబ‌డిన‌వారి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బ‌ట్ట‌త‌ల‌తోనే నెట్టుకువ‌స్తున్నారు. చాలామంది జుట్టు ఊడ‌టాన్ని ఆప‌లేక హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చేయించుకుంటున్నారు. బ‌ట్ట‌త‌ల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి ఇది చ‌క్క‌టి మార్గం.

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్
తాజాగా దివంగ‌త న‌టి శ్రీదేవి భ‌ర్త‌, నిర్మాత బోనీ క‌పూర్ కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ చేయించుకున్నాడు. ఇటీవ‌ల‌ హైదరాబాద్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన బోనీ క‌పూర్ అదే క్లినిక్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. ఇంకేముంది, అత‌డి బ‌ట్ట‌త‌ల‌ను కాస్తా నిండైన ఒత్తైన వెంట్రుక‌ల‌తో నింపేశారు.  

నా త‌ల‌పై వెంట్రుక‌లు వ‌చ్చాయ్‌..
ఇది చూసిన బోనీ క‌పూర్‌.. నా త‌ల‌పై వెంట్రుక‌లు వ‌చ్చాయ్‌. ఇది నా లుక్‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో చూడాలి అని చెప్పుకొచ్చాడు. 68 ఏళ్ల వ‌య‌సులో జుట్టు కోసం ఆరాట‌ప‌డుతుండటం చూసి నెటిజ‌న్లు ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా నిర్మాత‌గా బ్లాక్‌బ‌స్టర్ సినిమాలు తీసిన బోనీ క‌పూర్ గ‌తేడాది 'తు జూటీ మై మ‌క్క‌ర్' సినిమాతో న‌టుడిగా మారాడు. ఇందులో ర‌ణ్‌బీర్ క‌పూర్‌,  శ్ర‌ద్ధా క‌పూర్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

చ‌ద‌వండి: ష‌ణ్ముఖ్ అన్న‌ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకో అమ్మాయితో..

Advertisement
 
Advertisement