Bollywood TV Actress Neha Marda Blessed With A Baby Girl, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Neha Marda: పాపకు జన్మనిచ్చిన బుల్లితెర నటి నేహా మర్దా.. పోస్ట్ వైరల్

Apr 8 2023 5:20 PM | Updated on Apr 8 2023 6:07 PM

Bollywood TV Actress Neha Marda Blessed With A Baby Girl - Sakshi

బుల్లితెర నటి నేహా మర్దా బాలికా వధు(తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. డోలీ అర్మానో కి, క్యున్ రిష్టన్ మే కట్టి బట్టి లాంటి చిత్రాల్లోనూ నటించింది. గతంలోనే గర్భం ధరించినట్లు సోషల్ మీడియాలో వెల్లడించిన నటి.. తాజాగా పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే గర్భధారణ సంబంధిత సమస్యలతో నేహా మర్దా ఆసుపత్రిలో చేరారు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య స్థితిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

నేహా తన ఇన్‌స్టాలో రాస్తూ..'మా జీవితంలో అత్యుత్తమ క్షణాలు. మాకు ఇప్పుడే పాప పుట్టింది. తను రాగానే ఒక చిన్న మెరుపును తీసుకొచ్చింది. తానొక అద్భుతం. ఈ కొత్త జీవితంలో మమ్మల్ని తల్లిదండ్రుల్ని చేసినందుకు ధన్యవాదాలు. మా పాపకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నా.'అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నటికి కంగ్రాట్స్ చెబుతున్నారు. 

కాగా.. నేహా ఫిబ్రవరి 2012లో పాట్నాకు చెందిన వ్యాపారవేత్త ఆయుష్మాన్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది. గతేడాది గర్భం దాల్చినట్లు నేహా ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement