
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఇటీవల ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే రాబోయే కాలంలో మనుషులకు ప్రత్యామ్నాయంగా మారనుందని టాక్ వినిపించడమే. అయితే ఏఐ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉంటాయి. కృత్రిమ మేధతో ఉద్యోగాలు కూడా పోతాయన్నది ఓ వాదన. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏఐని మన జీవితంలో ఆహ్వానించక తప్పదేమో అనిపిస్తోంది.
అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఏఐ సాయంతో చేస్తున్న ఫోటోలు, వీడియోలు తెగ వైరలవుతున్నాయి. ఫన్ కోసం సినీతారల ఫోటోలను కోసం తెగ వాడేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలు, వారి సతీమణులతో ఉన్నట్లు చేసిన వీడియో నెట్టంట హల్చల్ చేస్తోంది. హీరోలు తమ భార్యలకు ఆహరం తినిపిస్తుండగా.. వాళ్లను మాత్రం బక్క చిక్కినట్లుగా ఇందులో చూపించారు. చివర్లో సల్మాన్ ఖాన్ మాత్రం ఒక్కడే తింటూ నిండుగా కనిపించారు. ఈ లెక్కన పెళ్లి చేసుకుంటే సినీ తారల పరిస్థితి కూడా ఇంతేనా?? అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఏఐ ఫన్నీ వీడియో మీరు కూడా చూసేయండి.
#SalmanKhan rocked 😅
Watch till the end pic.twitter.com/ryhgna8fbQ— Adil Hashmi👁🗨 (@X4SALMAN) August 2, 2025