ప్రముఖ నటుడి ట్విటర్ హ్యాక్..!

Bollywood Actor Manoj Bajpayee Twitter account hacked - Sakshi

బాలీవుడ్​ నటుడు మనోజ్​ బాజ్​పాయ్ ట్విట్టర్​ అకౌంట్​ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాలో పంచుకున్నారు.  ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. దయచేసి ఎవరూ కూడా తన అభిమానులు ఆందోళనకు గురి కావొద్దని తెలిపారు. అకౌంట్​ తిరిగి సరిచేసేంత వరకు అభిమానులు దాని జోలికి వెళ్లొద్దని కోరారు.

నటుడు మనోజ్​ బాజ్​పాయ్ ఇన్​స్టాలో రాస్తూ.. 'నా ట్విట్టర్ అకౌంట్​ హ్యాక్​ అయింది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు దయచేసి అభిమానులు ఎవరూ నా అకౌంట్​వెళ్లొద్దు. నా అకౌంట్ నుంచి వచ్చిన ఎటువంటి పోస్టులను అంగీకరించొద్దు. సమస్య పరిష్కరించాక నేను మీకు అప్‍ డేట్స్ ఇస్తా.' ఇన్​స్టాలో పేర్కొన్నారు.

ఇటీవలే శాండల్​వుడ్​లోనూ ఓ స్టార్​ అకౌంట్​ హ్యాక్​ అయ్యింది. కాంతార ఫేమ్​ కన్నడ స్టార్ కిశోర్​​ కుమార్​కు ట్విట్టర్​లో ఓ సమస్య ఎదురయ్యింది. ట్విట్టర్​ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఓ ఈ సందేశం కనిపించింది. దీంతో ఆయన ట్విట్టర్​ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని అందుకే తన ఖాతాను నిలిపివేశారని అన్నారు. కానీ.. తన ఆ తర్వాత అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేయడం వల్లే ఇలా జరిగిందని కిశోర్​ ఇన్​స్టాలో తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top