ఐదోసారి అలరించేందుకు వస్తోన్న కామెడీ ఎంటర్‌టైనర్‌.. ట్రైలర్ చూశారా? | Bolllywood Movie Housefull 5 Trailer Released now | Sakshi
Sakshi News home page

Housefull 5 Trailer: ఐదోసారి అలరించేందుకు వస్తోన్న కామెడీ ఎంటర్‌టైనర్‌.. ట్రైలర్ చూశారా?

May 27 2025 2:35 PM | Updated on May 27 2025 3:33 PM

Bolllywood Movie Housefull 5 Trailer Released now

అక్షయ్‌ కుమార్‌, అభిషేక్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హౌస్‌ఫుల్-5. గతంలో ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ‍అలరించాయి. హౌస్‌ఫుల్ సిరీస్‌లో ఐదో చిత్రంగా ఈ  సినిమా రానుంది. బాలీవుడ్‌లోనే నాలుగు భాగాలను రూపొందించిన మొట్టమొదటి ఫ్రాంచైజీగా హౌస్‌ఫుల్‌ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ సిరీస్‌లో ఐదో భాగంగా హౌస్‌ఫుల్‌-5 ట్రైలర్ చూస్తుంటే నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకుముందు వచ్చిన సినిమాల కంటే ఇందులో కామెడీ మరింత అలరించేలా ఉంది. కాగా.. ఈ చిత్రంలో రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌, సోనమ్‌ బాజ్వా, నర్గీస్‌ ఫక్రీ, సంజయ్‌ దత్‌, జాకీ ష్రాఫ్‌, నానా పటేకర్, చిత్రాంగద సింగ్, ఫర్దీన్ ఖాన్, చుంకీ పాండే కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి సాజిద్ నడియాద్వాలా నిర్మాతగా వ్యవహరించగా.. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement