రాకేష్‌ మాస్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు | BJYM Complaint On Rakesh Master In Kushaiguda Police Station | Sakshi
Sakshi News home page

రాకేష్‌ మాస్టర్‌ క్షమాపణలు చెప్పాలి

May 4 2021 1:51 PM | Updated on May 4 2021 2:02 PM

BJYM Complaint On Rakesh Master In Kushaiguda Police Station - Sakshi

సాక్షి, కుషాయిగూడ: హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన డ్యాన్స్‌ మాస్టర్‌ రాకేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేవైఎం రాష్ట్ర నాయకులు సందీప్‌యాదవ్‌ ఆధ్వర్యంలో సోమవారం కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌కు ఫిర్యాదు చేశారు.

అనంతరం సందీప్‌ యాదవ్‌ మాట్లాడుతూ శ్రీ కృష్ణ పరమాత్ముడిపై అనుచిత వాఖ్యలు చేసిన రాకేష్‌ మాస్టర్‌ భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో యాదవ సమాజం భౌతిక దాడులకు సైతం వెనుకాడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంగి లక్ష్మణ్, బీజేవైఎం నాయకులు ఉదయ్‌కిరణ్, నరేష్, మధు, రాకేశ్, జయంత్, అడ్వొకేట్‌ హరికృష్ణ ఉన్నారు.

చదవండి: నాపై దాడికి యత్నించారు: రాకేష్‌ మాస్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement