'సినిమా విషయాలు మాత్రమే చూసుకోండి..వేరే వాటిపై జోక్యం వద్దు'

BJPS Youth Wing Warns Actor Surya Threatens To Take Legal Action - Sakshi

సూర్య Vs బీజేపీ : 'తీరు మార్చుకోకుంటే చర్యలే'

సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కోలీవుడ్‌, టాలీవుడ్‌ సహా ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాన్ని సవరించడం ద్వారా మూవీ రిలీజ్‌ డేట్‌ కేంద్రం చేతుల్లోకి వెళ్తుందని సినీ పెద్దలు తీవ్ర అసనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సీనీ ప్రముఖులు బాహాటంగానే కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలె హీరో సూర్య కూడా కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే తాజాగా సూర్య వ్యాఖ్యలపై తమిళ బీజేపీ యువజన విభాగం మండిపడింది. సూర్య..తన సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే పట్టించుకుంటే మంచిదని, వేరే విషయాలపై జోక్యం చేసుకోవద్దని హితవు పలికింది. తీరు మార్చుకోకపోతే సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ యువజన విభాగం సూర్యపై చేసిన కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై సూర్య ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంది. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top