రియాకు ఆస్థాయి లేదు: డీజీపీ

Bihar DGP: Rhea Chakraborty Not have the Stature to Comment on Nitish Kumar - Sakshi

పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రియా చక్రవర్తిపై బీహార్ డీజీపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ విషయంలో మీడియా రాద్ధాంతం చేస్తుందని రియా కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో రియా దాఖలు చేసిన పిటిషన్‌లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేరును కూడా ప్రస్తావించారు. దీనిపై బీహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి రియాకు లేదన్నారు. 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సుశాంత్ కేసులో రాద్ధాంతం చేస్తున్నారని రియా తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను బీహార్‌లో నమోదు చేశారని, దీని వెనుక సీఎం నితీశ్‌ కుమార్‌ ఉన్నారని రియా ఆరోపించింది. దీనిపై బీహార్ డీజీపీ పై విధంగా  స్పందించారు. సుశాంత్‌ రాజ్‌పుత్‌ కేసును సీబీఐకు అప్పగించిన సంగతి తెలిసిందే. 

చదవండి: సీబీఐకి సుశాంత్ సింగ్‌‌ మృతి కేసు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top