ఇన్నాళ్లకు విష్ణు కళ్లు తెరిపించిన శ్రీముఖి.. పృథ్వీతో కటీఫ్‌! | Bigg Boss 8 Telugu November 30th Full Episode Review And Highlights: Sreemukhi Golden Suggestion To Vishnu Priya | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Nov 29th Highlights: అర్హత లేదన్నారు, అవినాష్‌ గెలిచి చూపించాడు.. పృథ్వీకి కటీఫ్‌ చెప్పిన విష్ణు

Published Fri, Nov 29 2024 11:35 PM | Last Updated on Sat, Nov 30 2024 11:47 AM

Bigg Boss Telugu 8, Nov 29th Full Episode Review: Sreemukhi Golden Suggestion to Vishnupriya

 

వైల్డ్‌కార్డ్స్‌కు టికెట్‌ టు ఫినాలే గెలిచే అర్హతే లేదన్నాడు పృథ్వీ.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అవినాష్‌ టికెట్‌ టు ఫినాలే ఎగరేసుకుపోయాడు. పృథ్వీ జపం చేస్తున్న విష్ణు కళ్లు తెరిపించింది శ్రీముఖి. మరి శ్రీముఖి ఏం చెప్పిందో నేటి (నవంబర్‌ 29) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చూసేయండి..

నాలుగో కంటెండర్‌గా తేజ
రోహిణి, అవినాష్‌, నిఖిల్‌ 'టికెట్‌ టు ఫినాలే' కంటెండర్లుగా నిలిచారు. వీరికి ఓ వ్యక్తిని కంటెండర్‌గా ఎన్నుకునే సూపర్‌ పవర్‌ ఇచ్చాడు. ముగ్గురూ కలిసి తేజ పేరు సూచించారు. ఇది పృథ్వీకి ఏమాత్రం నచ్చలేదు. తేజ, అవినాష్‌, రోహిణి.. ఈ ముగ్గురికీ టికెట్‌ టు ఫినాలే అందుకునే అర్హత లేదన్నాడు. మరోవైపు తేజ, గౌతమ్‌తో గొడవపడ్డాడు. నువ్వు సోలోగా ఆడుతున్నావని చెప్పడానికి నన్ను ఆటలో సైడ్‌ చేశావంటూ నిందలు వేశాడు. నా నిర్ణయం నా ఇష్టం.. దానికి నువ్వు గౌరవమివ్వకపోతే నేనేం చేయలేను అని గౌతమ్‌ హర్టయ్యాడు.

కరెక్ట్‌ గెస్‌ చేస్తే రూ.5 లక్షలు
అనంతరం యాంకర్‌ శ్రీముఖి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే ఎవరు టికెట్‌ టు ఫినాలే కొడతారో గెస్‌ చేయమని హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్‌ ఆడించింది. కరెక్ట్‌గా గెస్‌ చేస్తే రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్‌ అవుతాయంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది పందెమనే అనుకోవచ్చు. దీంతో ఇంటిసభ్యులు చర్చించుకుని నిఖిల్‌కు రూ.5 లక్షల బ్యాడ్జ్‌, అవినాష్‌కు రూ.4 లక్షలు, రోహిణికి రూ.3 లక్షలు, తేజకు రూ.2 లక్షలు అని రాసి ఉన్న బ్యాడ్జ్‌ ఇచ్చారు.

నాకోసం అతడిని వదిలెయ్‌
శ్రీముఖి.. విష్ణుప్రియ కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది. మొదటి మూడు వారాలు నువ్వు గెలుస్తావేమో అనిపించింది. ఆటలో కనెక్షన్స్‌ ఏర్పడతాయి. ఒకర్ని ఇష్టపడటం తప్పు కాదు. కానీ ఈ రెండు వారాలు నాకోసం ఆ అబ్బాయి(పృథ్వీ)తో స్నేహం వదిలెయ్‌. అతడు నాకిష్టం లేదు, ఆసక్తి లేదు అని అన్నిసార్లు చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు దిగజారి అతడి వెనకపడుతున్నావ్‌? నువ్వు ఎంకరేజ్‌ చేయకపోతే అతడు ఆడడా? నీ ప్రేమకు విలువిచ్చి చెప్తున్నా.. ఒక్కరికే కాకుండా అందరినీ సపోర్ట్‌ చేయు అని మంచి మాటలు చెప్పింది. 

ఆశలు పెట్టుకోవద్దని చెప్పా: పృథ్వీ
అటు పృథ్వీ దగ్గరకు వెళ్లి కూడా.. అందరూ మీ గురించి అడుగుతున్నప్పుడు స్టాండ్‌ తీసుకోవాలి కదా అని అడిగింది. అందుకతడు.. నీపై ఆశలు పెట్టుకోవచ్చా? అని విష్ణు అడిగినప్పుడు కూడా నాపై ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని స్పష్టంగా చెప్పానన్నాడు. ఏదైనా ఉంటే షో అయిపోయాక చూసుకుందామని మీ ఇద్దరూ మాట్లాడుకోండని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో విష్ణు.. పృథ్వీతో తన స్నేహాన్ని పక్కనపెట్టి గేమ్‌పై ఫోకస్‌ చేస్తానని చెప్పింది.

టికెట్‌ టు ఫినాలే గెలిచిన అవినాష్‌
అనంతరం గుర్తుపట్టు, గంట కొట్టు అనే గేమ్‌ ఇచ్చాడు. ఇందులో తేజకు 1, రోహిణికి 2, అవినాష్‌కు 3, నిఖిల్‌కు 4 పాయింట్లు వచ్చాయి. తక్కువ పాయింట్లు వచ్చిన తేజ గేమ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. తర్వాత శ్రీముఖి అందరికోసం వంట చేయడం విశేషం. అనంతరం రోహిణి, అవినాష్‌, నిఖిల్‌కు.. కేవలం ఒక్క అడుగుదూరం అనే గేమ్‌ ఇచ్చాడు. ఇందులో అవినాష్‌ విజయం సాధించి టికెట్‌ టు ఫినాలే గెలిచాడు. తన కల నెరవేరడంతో అవినాష్‌ సంతోషంలో మునిగి తేలాడు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement