నీకేమైనా దిమాఖ్‌ ఉందా..? ఏడ్చేసిన సీత | Bigg Boss 8 Telugu Today Episode Promos, Kirrak Seetha Cries Over Abhay Naveen Comments, Watch Promo Videos Inside | Sakshi
Sakshi News home page

ఆ ఒ‍క్క మాటతో భోజనం మధ్యలోనే ఆపేసి ఏడ్చేసిన సీత..

Sep 6 2024 4:05 PM | Updated on Sep 6 2024 5:55 PM

Bigg Boss Telugu 8: Kirrak Seetha Cries over Abhay Naveen Comments

కొన్నిసార్లు బిగ్‌బాస్‌ ఇచ్చే ట్విస్టులు మామూలుగా ఉండవు. ఇంట్లో ఉన్న ముగ్గురు చీఫ్‌లను కాస్తా మూడు టీమ్‌లు చేశాడు. మీలో ఎవరికి దమ్ముందో ప్రూవ్‌ చేసుకోవాలన్నాడు అయితే యష్మి, నైనిక టీమ్‌లో నలుగురి చొప్పున ఉంటే నిఖిల్‌ టీమ్‌లో మాత్రం ముగ్గురే ఉన్నారు. దాన్ని సమతుల్యం చేయాల్సింది పోయి యష్మి, నైనిక టీమ్స్‌కు పోటీ పెట్టాడు. 

నిన్నటి టాస్క్‌లో యష్మి టీమ్‌ గెలుపు
వీరిలో గెలిచిన టీమ్‌కు నిఖిల్‌ టీమ్‌లో నుంచి ఒకరిని లాక్కునే అవకాశం కల్పించాడు. ఈ ట్విస్టు విని హౌస్‌మేట్స్‌ అందరూ అవాక్కయ్యారు. ఇప్పటికే యష్మి, నైనిక టీమ్‌ల మధ్య నిన్న ఒక టాస్క్‌ జరగ్గా అందులో యష్మి టీమ్‌ గెలిచింది. నేడు ఈ రెండు టీమ్‌ల మధ్య మరో రెండు టాస్కులు జరిగాయి. ఈ మేరకు ప్రోమోలు వదిలారు. మొదట లూప్‌ ద హోల్స్‌ గేమ్‌ జరగ్గా ఇందులో నైనిక టీమ్‌ గెలిచింది. 

రెండో గేమ్‌లో ఎవరు గెలిచారంటే?
తర్వాత ఇటుకల టాస్క్‌ ఇచ్చారు. ఇందులో ఎలా గెలుద్దామని ఆలోచించడానికి బదులు పక్కవారిని ఎలా ఓడించాలన్నదానిపైనే ఫోకస్‌ పెట్టారు. ఎట్టకేలకు ఈ గేమ్‌లో యష్మి టీమ్‌ గెలిచింది. ​మరోవైపు కిచెన్‌ టీమ్‌లో ఉన్నవారు ఎప్పుడూ ఏదో ఒక గొడవలో ఇరుక్కుంటూనే ఉన్నారు. మీ గిన్నెలు మీరు కడుక్కోండని సీత అందరికీ చెప్పింది. దీంతో అభయ్‌.. నువ్వు నా కింద పని చేయట్లేదు, ఇది గేమ్‌ అని ఫ్రస్టేట్‌ అయ్యాడు. 

ఆ ఒక్క మాటతో..
అందరి గిన్నెలు మేమెందుకు కడగాలని సీత నిలదీయడంతో ఆ ప్రశ్న అడగడానికి దిమాఖ్‌ ఉండాలని సీరియస్‌ అయ్యాడు. దీంతో సీత తినే భోజనం మీద నుంచి లేచి ఏడుస్తూ వెళ్లిపోయింది. వంటగదిలో గిన్నెలు కడుగుతూనే ఉంటే ఎప్పుడు గేమ్‌ ఆడాలి? ఇంకెప్పుడు ముందుకు వెళ్లాలని విష్ణుప్రియతో చెప్పుకుంటూ ఫీలైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement