ఓటమిని తీసుకోలేని శివాజీ.. రైతుబిడ్డపై ఫ్రస్టేషన్‌ | Bigg Boss Telugu 7: Sivaji Argues with Shobha Shetty | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: యావర్‌ చేతిలో ఓడిన శివాజీ.. అది తట్టుకోలేక అరుపులు, కేకలు.. నీతులు చెప్పడానికే, పాటించడానికి కాదు!

Published Thu, Nov 16 2023 5:08 PM | Last Updated on Thu, Nov 16 2023 5:21 PM

Bigg Boss Telugu 7: Sivaji Argues with Shobha Shetty - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆటలు.. గెలుపోటములు సహజం, సర్వసాధారణం.. ఓడిపోయినప్పుడు కొందరు బాధతో ఏడుస్తారు. మరికొందరు ఆవేశంతో అరుస్తారు. హౌస్‌లో పెద్దమనిషిని అని చెప్పుకునే శివాజీ వీళ్లను బుజ్జగిస్తూ ఉంటాడు. ఇదంతా ఆటరా.. ఇలాంటి చిన్నచిన్నవాటికి గొడవలు దేనికిరా? ఎంజాయ్‌ చేయాలి కానీ.. అని నీతిబోధలు వల్లె వేస్తుంటాడు. అయినా నీతులు చెప్పడానికే కానీ పాటించడానికా? అన్నట్లు ఉంటుంది శివాజీ ప్రవర్తన..

ఓడిపోయి పక్కవాళ్లపై నిందలు
తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోతో అది మరోసారి రుజువైంది. బిగ్‌బాస్‌ విల్లు టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో ప్రిన్స్‌, ప్రియాంక, శివాజీ ఆడారు. వీరిలో శివాజీ, ప్రియాంక ఓడిపోగా ప్రిన్స్‌ గెలిచాడు. కానీ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన శివాజీ ఆవేశంతో ఊగిపోయాడు. ఆడుతుంటే పదేపదే మాట్లాడుతూ డిస్టర్బ్‌ చేస్తున్నాడని రైతుబిడ్డపై ఫ్రస్టేషన్‌ చూపించాడు. ఇక ఈ గేమ్‌లో శివాజీ ఓడిపోయాడని శోభ అనడంతో నీ ఇష్టం వచ్చినట్లు ఇచ్చుకో.. ఇది కరెక్ట్‌ కాదు అని అరిచాడు.

శివాజీ డబుల్‌ యాక్షన్‌
మీరు ఇలా మాట్లాడొద్దు అని శోభ అనేసరికి రోషం పొడుచుకొచ్చిన శివాజీ.. నీకన్నా పెద్దగా అరుస్తా.. ఎందుకరుస్తున్నావ్‌. అరవలేనా నేను అంటూ ఆమె మీదకు దూసుకెళ్లాడు. ఇది చూసిన నెటిజన్లు శివాజీ ద్వంద వైఖరిని ఎండగడుతున్నారు. ఆడ లేక మద్దెల ఓడు అన్నట్లు ఎందుకింత ఓవరాక్షన్‌ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. కాగా బిగ్‌బాస్‌ ఇంట్లో ఈ వారం ఇంతవరకు కెప్టెన్సీ టాస్క్‌ పెట్టలేదు. కానీ ఎలిమినేషన్‌ నుంచి కాపాడే బ్రహ్మాయుధమైన ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ను మాత్రం ప్రవేశపెట్టాడు.

యావర్‌.. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ విన్నర్‌..
ఓ గేమ్‌ పెట్టి అందులో గెలిచిన అ‍ర్జున్‌కు ఆ పాస్‌ అందించాడు. కానీ అలా ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నాడు బిగ్‌బాస్‌. మరికొన్ని టాస్కులు ఉంటాయని.. చివరగా గెలిచిన వ్యక్తికి ఈ పాస్‌ సొంతమవుతుందని వెల్లడించాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగిన అన్ని పోటీల్లో ప్రిన్స్‌ యావర్‌ దుమ్ముదులిపి పాస్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి దీన్ని ఎవరి కోసం వాడతాడు? అనేది ఆసక్తికరంగా మారింది.

చదవండి: పోలీసులకు దొరికిపోయిన యాంకర్‌ సుమ తనయుడు. ఏం జరిగిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement