Bigg Boss Telugu 6: Hit And Flop Contestants List - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: వాళ్లు హిట్టు, వీళ్లు ఫ్లాప్‌.. అర్జున్‌ పరువు పోయిందిగా!

Published Sat, Oct 8 2022 11:20 PM

Bigg Boss Telugu 6:Hit And Flop Contestants list - Sakshi

Bigg Boss Telugu 6, Episode 35: బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో మరొకరిని ఎలిమినేట్‌ చేసే సమయం ఆసన్నమైంది. అయితే ఆ ఒక్కరిని పంపించేముందు కింగ్‌ నాగార్జున హౌస్‌మేట్స్‌తో ఫన్‌ టాస్కులు ఆడిస్తాడన్న విషయం తెలిసిందే కదా! కాకపోతే ఈరోజు హిట్‌, ఫ్లాప్‌ అనే టాస్క్‌ ఆడించాడు నాగ్‌. మరి అది ఎలా సాగింది? ఎవరు హిట్‌? ఎవరు ఫ్లాప్‌ అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదవాల్సిందే!

నాగార్జున వచ్చీరాగానే రేవంత్‌ కెప్టెన్సీలోని కొన్ని పొరపాట్లను సరిదిద్దాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో హిట్‌, ఫ్లాప్‌ గేమ్‌ ఆడించాడు. అందులో భాగంగా నాగ్‌ ఇద్దరిద్దరినీ పిలిచి బోనులో నిలబెడతాడు. వారిద్దరూ తాము ఎందుకు హిట్‌ అనేది చెప్పాలి. అయితే హౌస్‌మేట్స్‌ అంతిమంగా ఆ ఇద్దరిలో ఎవరు హిట్‌? ఎవరు ఫ్లాప్‌ అనేది నిర్ణయిస్తారు. ముందుగా నాగ్‌.. ఇనయ, సూర్యలను పిలిచాడు. సూర్యతో కలిపి పిలవడంతో ఇనయ తెగ మెలికలు తిరిగింది. బోనులోకి రాగానే సూర్య మాట్లాడుతూ.. ఇనయ వాంటెడ్‌గా కెమెరాల ముందు కంటెంట్‌ ఇస్తుంది. కాబట్టి తను ఫ్లాప్‌ అన్నాడు సూర్య. ఇంటిసభ్యులందరు కూడా అతడితో ఏకీభవిస్తూ సూర్యను హిట్‌, ఇనయను ఫ్లాప్‌గా తేల్చారు.

తర్వాత ఆదిరెడ్డి, గీతూ బోనులో నిల్చున్నారు. గీతూ మాట్లాడుతూ.. అన్ని విషయాల్లో ఇద్దరం సేమ్‌, కానీ నా గేమ్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కాబట్టి నేను హిట్‌ అని చెప్పింది గీతూ. కానీ ఇంటిసభ్యులందరు మాత్రం ఆదిరెడ్డిని హిట్‌ అన్నారు.అనంతరం సుదీప, చంటి బోనులోకి వచ్చారు. సుదీప మాట్లాడుతూ.. అందర్నీ కలుపుకుపోతున్న తాను హిట్‌, ఎవ్వర్నీ కలుపుకోలేకపోతున్న చంటి ఫ్లాప్‌ అని చెప్పింది. చంటి కూడా తాను ఫ్లాప్‌ అని ఒప్పేసుకున్నాడు. దీంతో ఇంటిసభ్యులు కూడా సుదీపకే మద్దతిస్తూ ఆమెకు హిట్‌ ఇచ్చారు. కెప్టెన్‌ రేవంత్‌ను హౌస్‌మేట్స్‌ హిట్‌గా నిర్ధారించారు.

వాసంతి, అర్జున్‌లు బోనులో నిలబడగా వాసంతి హిట్‌ అని హౌస్‌మేట్స్‌ నిర్ధారించారు. తర్వాత ఆదిరెడ్డి, ఫైమా, బాలాదిత్య వరుసగా సేవ్‌ అయ్యారు. ఇక శ్రీసత్య- శ్రీహాన్‌ కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియో క్లిప్‌ చూపించగా అందులో అర్జున్‌ ముఖం వేలాడేసుకోవడం చూసి హౌస్‌మేట్స్‌ పడీపడీ నవ్వారు.ఫైనల్‌ హిట్‌ - ఫ్లాప్‌ గేమ్‌లో బాలాదిత్య, మెరీనా, కీర్తి, శ్రీహాన్‌లు హిట్‌ కంటెస్టెంట్లుగా, ఇనయ, ఫైమా, గీతూ, రోహిత్‌, చంటి, సత్య, అర్జున్‌, రాజ్‌ ఫ్లాప్‌ కంటెస్టెంట్లుగా తేలారు. ఫ్లాప్‌ లిస్టులో ఉన్నవారు గన్నీ బ్యాగులు వేసుకోవాలని నాగార్జున శిక్ష విధించాడు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం చలాకీ చంటి ఈ వారం ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది.

చదవండి: థియేటర్‌లో టపాసులు కాల్చిన సల్లూభాయ్‌ ఫ్యాన్స్‌, వీడియో ఇదిగో
పస్తులుంటున్న ఆ కంటెస్టెంట్‌ అవుట్‌!

Advertisement
Advertisement