Bigg Boss 6 Telugu: Vasanthi Exit Interview With Anchor Shiva, Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: మేకప్‌ వేసుకోవడం తప్ప గేమ్‌ లేదన్న యాంకర్‌, కౌంటరిచ్చిన వాసంతి

Nov 14 2022 4:42 PM | Updated on Nov 16 2022 12:36 AM

Bigg Boss Telugu 6: Vasanthi Exit Interview With Anchor Shiva - Sakshi

ఎలిమినేట్‌ అయినా ఇంత కూడా బాధపడటం లేదని అడగ్గా.. ఫేస్‌ మీద కనిపిస్తేనే బాధ కాదు, లోపల కూడా ఉంటుంది అని వాసంతి బదులిచ్చింది. 

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో పదివారాలు గడిచిపోయాయి. ఇప్పటివరకు షాని, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చలాకీ చంటి, సుదీప, అర్జున్‌ కల్యాణ్‌, ఆర్జే సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి వరుసగా ఎలిమినేట్‌ అయ్యారు. చివరగా వాసంతి ఎలిమినేషన్‌తో హౌస్‌లో పది మంది మిగిలారు. హౌస్‌ నుంచి బయటకు వచ్చేసిన వాసంతి బిగ్‌బాస్‌ కెఫెలో పాల్గొంది. ఇంటర్వ్యూలో ఆమెను ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు యాంకర్‌ శివ. అతడి ప్రశ్నలకు తగ్గట్టుగానే దిమ్మతిరిగే సమాధానాలిచ్చింది వాసంతి.

అందంలో బుట్టబొమ్మ.. ఆటలో ఉత్తబొమ్మ అంటూ ఎంట్రీలోనే వాసంతి పరువు తీశాడు యాంకర్‌. ఎలిమినేట్‌ అయినా ఇంత కూడా బాధపడటం లేదని అడగ్గా.. ఫేస్‌ మీద కనిపిస్తేనే బాధ కాదు, లోపల కూడా ఉంటుంది అని బదులిచ్చింది వాసంతి. మేకప్‌ వేసుకుని నీట్‌గా రెడీ అవడం తప్ప గేమ్‌ ఏమీ ఆడలేదని శివ అనగా బిగ్‌బాస్‌ షోకి ఏమేం కావాలో అన్నీ చేసొచ్చానంది. కాకపోతే హౌస్‌లో తనకెవరి సపోర్ట్‌ లేదని చెప్పగా లోపల ఎవరు సపోర్ట్‌తో ఆడుతున్నారని ప్రశ్నించాడు శివ. దీనికామె శ్రీహాన్‌, శ్రీసత్య కలిసి ఆడుతున్నారని ముక్కుసూటిగా జవాబిచ్చింది. హౌస్‌లో అల్లరి చేస్తానన్నావ్‌, ఏం అల్లరి చేశావ్‌? ఎక్కడ యాక్టివ్‌గా ఉన్నావని అడగ్గా యాక్టివ్‌గా లేకపోతే పదోవారం దాకా ఉండేదాన్నే కాదు, జనాలకు నచ్చకపోతే నన్ను రెండోవారమే పంపించేవారని కౌంటరిచ్చింది వాసంతి.

చదవండి: ఆ నలుగురు బెస్ట్‌, ముగ్గురు ఫేక్‌ అన్న వాసంతి
ఆ ఇద్దరే టార్గెట్‌, నామినేషన్స్‌లో ఉన్నది వాళ్లే!

Advertisement
 
Advertisement
Advertisement