Bigg Boss 6 Telugu Episode 71 Highlights: Vasanthi Reveals Her Best Friends And Fake Friends - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఆ నలుగురు బెస్ట్‌, ముగ్గురు ఫేక్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పిన వాసంతి

Published Sun, Nov 13 2022 11:07 PM

Bigg Boss 6 Telugu: Vasanthi Reveals Her Best Friends and Fake Friends - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 71: బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ 21 మందితో మొదలైంది. పది వారాలు గడిచేసరికి 11 మంది ఎలిమినేట్‌ అవగా హౌస్‌లో ప్రస్తుతం పది మంది మాత్రమే మిగిలారు. దీంతో బిగ్‌బాస్‌ షో మరింత రసవత్తరంగా మారనుంది. ఇకపోతే ఈరోజు గ్లామర్‌ ఆఫ్‌ ది హౌస్‌ వాసంతి ఎలిమినేషన్‌ ఎలా జరిగింది? ఆమె హౌస్‌ నుంచి బయటకు వచ్చాక ఏం మాట్లాడింది? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయాల్సిందే!

ఎప్పటిలాగే సండే ఫండే అనేమాటకు కట్టుబడి నాగ్‌ హౌస్‌మేట్స్‌తో గేమ్స్‌ ఆడించాడు. ఇందుకోసం రేవంత్‌, ఇనయ, మెరీనా, రాజ్‌, ఫైమాలను A టీమ్‌గా.. కీర్తి, శ్రీహాన్‌, రోహిత్‌, వాసంతి, శ్రీసత్యలను B టీమ్‌గా విడగొట్టాడు నాగ్‌. మొదట ఆడించిన ఫన్‌ గేమ్‌లో టీమ్‌ A (రేవంత్‌) గెలిచింది. తర్వాత కనుక్కోండి చూద్దాం అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో హౌస్‌మేట్స్‌తో పాటు సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటో చూపించి అదెవరో కనుక్కోవాలన్నాడు. తప్పు సమాధానం చెప్పినవారికి చిత్రవిచిత్ర పనిష్మెంట్స్‌ ఇచ్చాడు.

ఈ క్రమంలో రాంగ్‌ ఆన్సర్లిచ్చిన ఫైమా.. ముగ్గురు కంటెస్టెంట్లు అయిన బాలాదిత్య, రేవంత్‌, రాజ్‌లను ఇమిటేట్‌ చేసి నవ్వించింది. తర్వాత వాసంతి గోడకుర్చీ వేసి ఎనిమిదవ ఎక్కం చదివింది. కానీ ఇక్కడ కూడా తప్పు చదివి నవ్వులపాలైంది. ఆ తర్వాత తప్పు జవాబు చెప్పిన ఇనయ, కీర్తి కోడిలా గెంతుతూ పాట పాడారు. రెండో గేమ్‌లో కూడా B టీమ్‌పై A టీమ్‌ విజయం సాధించింది. దీంతో A టీమ్‌కు గిఫ్ట్‌ హ్యాంపర్‌ అందించారు.

నాగార్జున నామినేషన్‌లో ఉన్న ఒక్కొక్కరినీ సేవ్‌ చేసుకుంటూ రాగా చివరికి వాసంతి, మెరీనా ఇద్దరు మాత్రమే మిగిలారు. వీరిలో వాసంతి ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు నాగ్‌. హౌస్‌ను వీడేందుకు మనసొప్పని వాసంతి కన్నీళ్లతో బయటకు వచ్చేసింది. స్టేజీపైకి వచ్చిన వాసంతితో.. 5 ఫేక్‌ ఫ్రెండ్స్‌, 5 బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరని గేమ్‌ ఆడించాడు. దీనికి ఆమె ఐదుగురు పేర్లు చెప్పలేనంటూ మెరీనా, ఇనయ, రేవంత్‌, కీర్తి తన బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పింది.

ఫైమా, ఆదిరెడ్డి, రాజ్‌ ఫేక్‌ ఫ్రెండ్స్‌ అని పేర్కొంది. వాసంతి ఎలిమినేషన్‌తో హౌస్‌లో 10 మంది మాత్రమే మిగిలారు. మీ పది మందిలో ఒకరే విజేత అని, వారికి రూ.50 లక్షల బహుమతి ఉంటుందని ప్రకటించాడు నాగ్‌. మరి ఈ టాప్‌ 10 కంటెస్టెంట్ల నెక్స్ట్‌ గేమ్‌ ఎలా ఉండనుంది? ఎవరు టాప్‌ 5కి చేరువవుతారు? ఎవరు విన్నర్‌గా నిలిచి అర కోటి రూపాయలు అందుకుంటారో చూడాలి!

చదవండి: పేరెంట్స్‌ గుండెల మీద తన్నాను, తప్పు తెలిసి అమ్మ కాళ్ల మీద పడ్డా: సూర్య
ఎవరు చేసిన పనికి వాళ్లే బాధ్యులు.. గీతూ ఎలిమినేషన్‌పై బాలాదిత్య కామెంట్స్‌

1/9

2/9

3/9

4/9

5/9

6/9

7/9

8/9

9/9

Advertisement
Advertisement