Bigg Boss Telugu 6: Baladitya Exit Interview After Elimination - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఆఫ్టరాల్‌ ఒక్క సిగరెట్‌కు అంత సీన్‌ అవసరమా?: యాంకర్‌

Nov 13 2022 4:15 PM | Updated on Nov 14 2022 7:17 PM

Bigg Boss Telugu 6: Baladitya Exit Interview After Elimination - Sakshi

నేషనల్‌ టెలివిజన్‌లో ఒక అమ్మాయిని సిగ్గుందా? అనడం కరెక్టా? అని అడిగాడు. దీనికి అతడు ఆ మాట తప్పు కానీ నా బాధ తప్పు కాదని సమాధానమిచ్చాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరివాడుగా పేరుతెచ్చుకున్నాడు బాలాదిత్య. కాకపోతే అతి మంచితనం, అతి స్పీచులు ఎక్కువవడంతో మిగతా హౌస్‌మేట్స్‌ ఆయన ఏం చెప్పినా సోదిగా ఫీలయ్యేవారు. గీతూ అయితే అతడు మాట్లాడుతుంటే మధ్యలోనే కట్‌ చేసేది. అతడి నోరు మూయించేందుకు ఇమ్మెచ్యూర్‌ అని పెద్ద మాటే అనేసింది. కొన్ని క్షణాల పాటు బాలాదిత్య హర్టయినా తనకు తెలీక ఆ మాట అనేసిందేమోనని లైట్‌​ తీసుకున్నాడు.

కానీ ఓ టాస్క్‌లో గీతూ తన సిగరెట్లు దాచి వీక్‌నెస్‌ మీద దెబ్బ కొట్టడాన్ని తీసుకోలేకపోయాడు. కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేక సిగ్గుందా? మనిషివేనా? అని నానామాటలు అన్నాడు. అయినా గీతూ దాన్ని పెద్ద రాద్ధాంతం చేయకుండా ఒంటరిగా కంటనీరు పెట్టుకుంది. తాజాగా యాంకర్‌ శివ ఇదే విషయాన్ని బాలాదిత్యను అడిగాడు.

షో నుంచి బయటకు వచ్చేసిన ఆదిత్య బిగ్‌బాస్‌ కెఫె ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా శివ.. నేషనల్‌ టెలివిజన్‌లో ఒక అమ్మాయిని సిగ్గుందా? అనడం కరెక్టా? అని అడిగాడు. దీనికి అతడు ఆ మాట తప్పు కానీ నా బాధ తప్పు కాదని సమాధానమిచ్చాడు. ఆఫ్టరాల్‌ ఒక్క సిగరెట్‌ అన్న నువ్వు అంత సీన్‌ చేయడం అవసరమా? మీ వల్లే గీతూ వెళ్లిపోయిందని శివ పేర్కొన్నాడు. దీన్ని అంగీకరించని బాలాదిత్య ఎవరు చేసిన పనికి వాళ్లే బాధ్యులు అని స్పష్టం చేశాడు.

చదవండి: రాజకీయాల్లోకి వస్తా: గీతూ రాయల్‌
ఎలాంటి మరక లేకుండా మంచి పేరుతో బయటకు వచ్చిన బాలాదిత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement