Bigg Boss Telugu 6: గొప్పోడివయ్యా, మంచి మనిషిగా బయటకు వచ్చేసిన బాలాదిత్య!

Bigg Boss 6 Telugu: Baladitya Exit From BB Show - Sakshi

Bigg Boss Telugu 6, Episode 70: బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో వరుసగా ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అవుతూ వస్తున్నారు. గీతూ ఎలిమినేషన్‌ మరవకముందే బాలాదిత్య ఎలిమినేట్‌ అయ్యాడు. దీంతో షాక్‌లోకి వెళ్లిపోయాడు ఆది. తాను స్ట్రాంగ్‌ అనుకున్న కంటెస్టెంట్లు అవుట్‌ అవుతున్నారేంటని అయోమయానికి లోనయ్యాడు. మరి వెళ్లేముందు బాలాదిత్య హౌస్‌మేట్స్‌కు ఎలాంటి సూచనలిచ్చాడో చూద్దాం..

మొన్నటి కెప్టెన్సీ టాస్క్‌ను ప్రస్తావించిన నాగార్జున.. ఆ టాస్క్‌లో రేవంత్‌ సంచాలక్‌గా వ్యవహరించాడని చెప్పాడు. అటు ఇనయ కోపంలో ఏది పడితే అది అనేస్తుందని సీరియస్‌ అయ్యాడు. నామినేషన్స్‌లో ఫైమాను అడల్ట్‌ కామెడీ స్టార్‌ అన్నావు, అది తప్పని హెచ్చరించడంతో ఆమె సారీ చెప్పింది. అనంతరం హౌస్‌మేట్స్‌తో డాక్టర్‌- పేషెంట్‌ గేమ్‌ ఆడించాడు నాగ్‌. కొన్ని జబ్బుల పేర్లున్న కార్డులు పంపించి అది ఎవరికి సూటవుతుందో వారి మెడలో వేయాలన్నాడు నాగ్‌. అంతేకాకుండా ఆ జబ్బుకు తగ్గట్లు మందు ఇవ్వాలన్నాడు.

ముందుగా శ్రీసత్య.. రేవంత్‌కు మొండితనం ఎక్కువని చెప్పి నిమ్మరసం తాగించింది. ఇనయ.. వాసంతికి ఇమ్మెచ్యురిటీ ఎక్కువని, మనిషి ఎదిగినా తన బ్రెయిన్‌ ఎదగలేదంటూ ఉసిరి రసం ట్రీట్‌మెంట్‌ ఇచ్చింది. రాజ్‌.. ఇనయ వితండవాదం చేస్తుందని కాకరకాయ రసం తాగించాడు. ఫైమా.. ఇనయకు ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఎక్కువంటూ ఆమెకు నిమ్మరసం అందించింది. నమ్మకద్రోహం చేసిందంటూ వాసంతితో ఉసిరి రసం తాగించింది మెరీనా. 

ఇనయ ఇగోతో గేమ్‌ ఆడుతుందన్నాడు ఆదిరెడ్డి. శ్రీసత్యకు కక్కుర్తి ఎక్కువన్నాడు రేవంత్‌. ఇనయకు తలపొగరు ఎక్కువని చెప్పాడు రోహిత్‌. శ్రీసత్యకు ఇగో ఎక్కువంది కీర్తి. ఫైమాకు స్వార్థమెక్కువని బాలాదిత్య, రేవంత్‌కు స్వార్థమెక్కువని శ్రీహాన్‌ అభిప్రాయపడ్డారు. శ్రీసత్య మానిప్యులేటర్‌ అని వాసంతి అనగా అది నేనూ ఒప్పుకుంటానన్నాడు నాగ్‌. అనంతరం బాలాదిత్య ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. దీంతో అందరూ షాకయ్యారు. స్టేజీపైకి వచ్చిన బాలాదిత్య హౌస్‌మేట్స్‌కు విలువైన సూచనలు చేశాడు.

ఆదిరెడ్డిని గట్టిగా అరవకుండా కాన్ఫిడెంట్‌గా మాట్లాడమన్నాడు. స్ట్రాటజీలు ఫెయిరా? అన్‌ఫెయిరా? కాస్త చూసుకొని ఆడమని ఫైమాకు సలహా ఇచ్చాడు. రాజ్‌.. ఏదైనా క్లారిటీగా చెప్పాలన్నాడు. రోహిత్‌ను టెంపర్‌ లూజవ్వద్దని సూచించాడు. మెరీనా ఇండిపెండెంట్‌గా ఆడాలన్నాడు. గీతూ తర్వాత ఎక్కువ కనెక్ట్‌ అయింది సత్యకే అంటూ కోపంలో మాటలు వదిలేయొద్దని కోరాడు. శ్రీహాన్‌ తెలివైనవాడని, కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోమన్నాడు.

రేవంత్‌ రౌద్రంగా కనిపించే పసిపిల్లాడని చెప్పాడు. అగ్రెషన్‌ ఒక్కటి తగ్గించుకోవాలని సూచించాడు. ఇనయకు ఏదైనా చెప్పే ధైర్యం ఉంది, కానీ చెప్పే విధానం సరిగా లేదంటూ దాన్ని సరిచేసుకోమన్నాడు. కీర్తిని ఎక్కువ ఆలోచించొద్దన్నాడు. వాసంతిని ఓటమి నుంచి మోటివేట్‌ అయి గేమ్‌ ఆడాలని పేర్కొన్నాడు. ఇక హౌస్‌లో ఏ నెగెటివిటీ మూటగట్టుకోకుండా స్వచ్ఛమైన మనసుతో మంచివాడన్న బిరుదుతోనే బయటకు వచ్చేశాడు బాలాదిత్య. రేపటి ఎపిసోడ్‌లో మెరీనాకు బదులుగా వాసంతి ఎలిమినేట్‌ కానున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ఓడిపోతే బూతులు మాట్లాడతావా: ఇనయపై నాగ్‌ ఫైర్‌
టాప్‌ 5లో శ్రీహాన్‌ డౌటే, ఇనయ లేకపోతే బిగ్‌బాసే లేదు: గీతూ

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top