Bigg Boss Telugu 6: Srihan Gets Pleasant Birthday Surprise - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: అర్జున్‌తో ఫైట్‌, తొడకొట్టి సవాలు విసిరిన శ్రీహాన్‌

Oct 20 2022 3:43 PM | Updated on Oct 20 2022 4:52 PM

Bigg Boss Telugu 6: Srihan Gets Pleasant Birthday Surprise - Sakshi

అర్జున్‌ను ఎత్తి పడేసిన శ్రీహాన్‌ దమ్ముంటే అడ్డుకో అంటూ తొడకొట్టి సవాలు విసిరాడు.  అర్జున్‌, శ్రీహాన్‌కు గట్టిగానే గొడవ జరిగినట్లు కనిపిస్తోంది.

బిగ్‌బాస్‌ వార్నింగులు, ఇంట్రస్టింగ్‌ టాస్కులతో షో రంజుగా మారింది. మొదట ఇంట్లో ఉన్న ఫుడ్‌ అంతా బిగ్‌బాస్‌ తీసుకెళ్లిపోగా టాస్కులు గెలిచి దాన్ని తిరిగి సంపాదించుకున్నారు హౌస్‌మేట్స్‌. ఈ క్రమంలో ఇంటిసభ్యులు శ్రీహాన్‌ బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసేందుకు రెడీ అయ్యారు. విచిత్రంగా ఇనయ దగ్గరుండి ఆ పనులు చూసుకోవటం గమనార్హం. ఇదే విషయంపై శ్రీహాన్‌ను ఆటపట్టించారు మిగతా హౌస్‌మేట్స్‌. మరోవైపు ఇనయ కేక్‌పై చోటు అని రాయించి హార్ట్‌ సింబల్‌ పెట్టించింది. ఇదేదో నా కొంప ముంచేలా ఉందంటూనే శ్రీహాన్‌ కేక్‌ కట్‌ చేసి ఇనయకు తినిపించాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌తో వీరి పిట్ట గోల ముగిసినట్లైంది.

ఆహారం కోసం పోట్లాడిన హౌస్‌మేట్స్‌ ఇంట్లో ఉండేందుకు కావాల్సిన అర్హత కోసం ఫైట్‌ చేయండంటూ పూల టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో కూడా ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించినట్లు తెలుస్తోంది. ఇందులో అర్జున్‌, శ్రీహాన్‌కు గట్టిగానే గొడవ జరిగినట్లు కనిపిస్తోంది. అర్జున్‌ను ఎత్తి పడేసిన శ్రీహాన్‌ దమ్ముంటే అడ్డుకో అంటూ తొడకొట్టి సవాలు విసిరాడు. మరి ఈ టాస్క్‌లో ఏ టీమ్‌ గెలిచింది? అనేది తెలియాలంటే ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: ఆదిరెడ్డి బయటకు పోతావ్‌, వేరేవాళ్లు పోతే ఫీలవుతా: గీతూ
 

Advertisement
 
Advertisement
Advertisement