Bigg Boss Telugu 5: Syamala Devi Supports to Sreerama Chandra- Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: ప్రభాస్‌ ఫ్యామిలీ నుంచి సింగర్‌ శ్రీరామ్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌

Dec 16 2021 12:35 PM | Updated on Dec 16 2021 5:31 PM

Bigg Boss Telugu 5: Syamala Devi Supports to Sreerama Chandra - Sakshi

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఫ్యామిలీ నుంచి సింగర్‌ శ్రీరామ్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌ వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-5 అతి త్వరలోనే ముగియనుంది. దీంతో కంటెస్టెంట్లకు మద్దతు ప్రకటిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్‌ క్యాంపెయిన్‌ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లలో సింగర్‌ శ్రీరామచంద్రకు సెలబ్రిటీల నుంచి గట్టి సపోర్ట్‌ కనిపిస్తుంది. ఇప్పటికే సోనూసూద్‌, శంకర్‌ మహదేవన్‌,ఎండీ సజ్జనార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ సహా పలువురు సెలబ్రిటీలు శ్రీరామ్‌కు మద్దతుగా నిలిచారు. తాజాగా కృష్ణంరాజు భార్య,  ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామల దేవి తన మద్ధతు ప్రకటించారు. వీడియో సందేశం ద్వారా శ్రీరామ్‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాయ్‌ శ్రీరామ్‌. బిగ్‌బాస్‌ షో చూస్తున్నాం. నాకు, కృష్ణంరాజు గారికి నీ పాటలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా భక్తి పాటలు చాలా ఇష్టం. అప్పుడు ఇండియన్‌ ఐడెల్‌లో గెలిచి తెలుగువారందరకీ ఎంతో గర్వకారణం అయ్యావ్‌. ఇప్పుడు బిగ్‌బాస్‌లో కూడా గెలవాలని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరపు నుంచి కోరుకుంటున్నాను. నువ్వు తప్పకుండా గెలుస్తావ్‌. ఆల్‌ ది బెస్ట్‌' అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. శ్రీరామచంద్రకు స్వయంగా కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సపోర్ట్‌ లభించడంతో శ్రీరామ్‌ ఫాలోవర్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement