Rahul sipligunj: కొత్తింటి కల సాకారం చేసుకున్న సింగర్‌

Bigg Boss Telugu 3 Winner Rahul Sipligunj Dream Home Come True - Sakshi

సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ అభిమానులతో గుడ్‌న్యూస్‌ పంచుకున్నాడు. కొత్తింటి కల సాకారమైందని, గృహ ప్రవేశం కూడా పూర్తయిందని తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా చెప్పాడు. అభిమానుల సపోర్ట్‌ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదన్నాడు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. దీంతో బుల్లితెర సెలబ్రిటీలు విశ్వ, అషూ, శిల్ప, మెహబూబ్‌ దిల్‌సే, రోల్‌ రైడా, అరియానా గ్లోరీ రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక రాహుల్‌ తన నూతన గృహంలో దిగిన ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా రాహుల్‌ సిప్లిగంజ్‌ బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే! ఈ సింగర్‌ పలు సినిమాల్లో పాడటంతో పాటు ఓ చిత్రంలో నటిస్తున్నాడు కూడా!

చదవండి: 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top