Bigg Boss Mehaboob Dil Se Guntur New Home Tour Video - Sakshi
Sakshi News home page

Mehaboob Dil Se: 16 నెలల కష్టం.. గుంటూరులో మెహబూబ్‌ హోమ్‌ టూర్‌

Feb 9 2022 3:58 PM | Updated on Feb 9 2022 4:52 PM

Bigg Boss Mehaboob Dil Se Guntur New Home Tour Video - Sakshi

సొంత ఊర్లో సొంతింటి కలను నిజం చేసుకున్నాడు మెహబూబ్‌. తల్లిదండ్రులు, తమ్ముడు, తాను తలా కొంత కూడబెట్టుకున్న డబ్బుతో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నామని చెప్పుకొచ్చాడు. ఆ ఇల్లును చూపిస్తూ హోమ్‌ టూర్‌ వీడియో చేశాడు.

మెహబూబ్‌ దిల్‌సే.. నాట్‌ జస్ట్‌ ఏ యూట్యూబర్‌.. వెరీ టాలెంటెడ్‌ యాక్టర్‌, డ్యాన్సర్‌ కూడా! ఇల్లు కట్టుకోవాలన్న కల అందరిలాగే అతడికి కూడా ఉండేది. బిగ్‌బాస్‌ షో అతడి కలకు పునాదులు వేసింది. తన కష్టార్జితానికి తోడు కుటుంబమంతా తలా కొంత సాయం చేయడంతో సొంతింటి కలను నిజం చేసుకున్నాడు మెహబూబ్‌. తల్లిదండ్రులు, తమ్ముడు, తాను తలా కొంత కూడబెట్టుకున్న డబ్బుతో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నామని చెప్పుకొచ్చాడు. గుంటూరులో ఉన్న ఆ ఇల్లును చూపిస్తూ హోమ్‌ టూర్‌ వీడియో చేశాడు.

ఈ ఇంటికి ఒకవైపు మూడు గదులు ఏర్పాటు చేయించి వాటిని దుకాణాల కోసం రెంట్‌కు ఇచ్చేలా నిర్మించారు. దీంతో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చిన్న హాల్‌, కిచెన్‌, సింగిల్‌ బెడ్‌ రూమ్‌ మాత్రమే ఉన్నాయి. మొదటి అంతస్థులో కిచెన్‌, హాల్‌తో పాటు రెండు విశాలమైన డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ ఉన్నాయి. మెహబూబ్‌ తన అభిరుచికి తగ్గట్టుగా కప్‌బోర్డ్స్‌, వాల్‌ పేపర్‌ అన్నీ దగ్గరుండి వేయించినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల పనులన్నీ చాలా లేట్‌గా అయ్యాయాన్న మెహబూబ్‌ ఫ్యామిలీ.. మొత్తంగా ఈ ఇల్లు కట్టడానికి 16 నెలలు పట్టిందని వెల్లడించింది. ఇంతకీ ఆ ఇల్లు ఎలా ఉందో మీరూ చూసేయండి..

Advertisement
 
Advertisement
Advertisement