Viral: Bigg Boss Beauty Ashu Reddy Kiss On Ariyana Glory Waist, Pic Viral - Sakshi
Sakshi News home page

Ariyana Glory - Ashu Reddy: బోల్డ్‌ బ్యూటీ నడుముపై అషూ కిస్‌

Feb 2 2022 9:06 AM | Updated on Feb 2 2022 12:39 PM

Bigg Boss Beauty Ashu Reddy Kisses On Ariyana Glory Waist - Sakshi

అషూ.. అరియానా నడుముకి ముద్దు పెట్టింది. దీంతో బోల్డ్‌ బ్యూటీ ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్‌ పెట్టింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన అషూ 'అనంతమైన హావభావం'..

అరియానా గ్లోరీ, అషూ రెడ్డి.. వీళ్లిద్దరూ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు. కాకపోతే అషూ మూడో సీజన్‌లో అరియానా నాలుగో సీజన్‌లో పాల్గొన్నారు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీని నానాటికీ పెంచుకుంటూ పోతున్నారు వీరిద్దరు. ఈ క్రమంలో అషూ రీసెంట్‌గా పెట్టిన ఓ పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందంటారా? అషూ.. అరియానా నడుముకి ముద్దు పెట్టింది. దీంతో బోల్డ్‌ బ్యూటీ ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్‌ పెట్టింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన అషూ 'అనంతమైన హావభావం' అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఇదేమైనా సాంగ్‌ పర్ఫామెన్సా? లేదా వీళ్ల క్రేజీనెస్సా? తెలీదు కానీ నెటిజన్లు మాత్రం కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

'ఏందిరా ఈ చండాలము, ఈ పోస్ట్‌ వల్ల ఉపయోగం ఏంటో ఎవరైనా చెప్తారా?', 'ఏదో తేడాగా ఉందే', 'ఈ ఫొటో ఆర్జీవీ కానీ చూడాలి', 'లెస్బియన్స్‌ అంటే వినడమే తప్ప చూడలే అనుకున్నా, కానీ ఇప్పుడు చూసేశా', 'ఇది చాలా టూమచ్‌' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది చూసిన అరియానా.. 'ఒసేయ్‌ అషూ నీకు, నీ క్రేజీనెస్‌కి దండమే తల్లి. పాపం అందరూ తప్పుగా అనుకుంటున్నారే, జడ్జిమెంటల్‌ అవుతున్నాం' అని ఆందోళనతో కామెంట్‌ చేసింది. దీనికి అషూ స్పందిస్తూ.. 'మంచైనా, చెడైనా ప్రజలెప్పుడూ జడ్జ్‌ చేస్తూనే ఉంటారు. అలా అని మన క్రేజీనెస్‌ని వదిలేయకూడదు. ఎందుకంటే అదే మనల్ని ఇతరుల కన్నా ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ విషయం నేను ఆర్జీవీ నుంచే నేర్చుకున్నా' అని రిప్లై ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement