తెలుగు రాదు, కానీ తెలివి చాలా ఉందంటోన్న అమిగోస్‌ బ్యూటీ | Bigg Boss 7 Telugu: Subhashree Rayaguru Entered as 5th Contestant | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: ఐదో కంటెస్టెంట్‌గా హీరోయిన్‌, లాయర్‌ శుభశ్రీ

Sep 3 2023 8:10 PM | Updated on Oct 8 2023 7:13 PM

Bigg Boss 7 Telugu: Subhashree Rayaguru Entered as 5th Contestant - Sakshi

ఒడిశాలో పుట్టిపెరిగిన శుభశ్రీ రాయగురు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. చిన్నప్పటినుంచే చదువుల్లో ముందున్న ఆమె ముంబైలో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసింది. చదివింది లాయర్‌ అయినప్పటికీ శుభశ్రీకి మోడలింగ్‌ అంటే ఇష్టం. అలా 2020లో వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. తర్వాత యాంకర్‌గా మారిన ఆమె హిందీ సినిమా మస్తీజాదే చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించింది.

2022లో రుద్రవీణ సినిమాతో హీరోయిన్‌గా మారింది. డెవిల్‌ మూవీతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అమిగోస్‌, కథ వెనుక కథ.. ఇలా పలు చిత్రాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. తనకు తెలుగు రాదు, కానీ తెలివి మాత్రం చాలా ఉందంటోంది శుభశ్రీ. మరి ఆ తెలివిని రానున్న రోజుల్లో ఎలా ఉపయోగిస్తుందో చూడాలి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement