రతిక బండారం బయటపెట్టిన మాజీ బాయ్‌ఫ్రెండ్! | Bigg Boss 7 Telugu: Rahul Sipligunj Sensational Comments On Rathika Rose, Post Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Rahul Sipligunj Comments On Rathika: పేరు చెప్పకుండా సీరియస్ అయిన సింగర్ రాహుల్

Published Wed, Sep 20 2023 9:10 PM | Last Updated on Sun, Sep 24 2023 10:13 AM

Bigg Boss 7 Telugu Rahul Sipligunj Comments On Rathika Rose - Sakshi

తెలుగు 'బిగ్‌బాస్'.. మరీ కాకపోయినా సరే ఓ మాదిరిగా అలరిస్తుంది. తొలి రెండు వారాలు చాలావరకు సైలెంట్‌గా ఉన్న కంటెస్టెంట్స్.. ఇప్పుడు అంటే మూడో వారం రెచ్చిపోయి మరీ ఫెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. గొడవలే టార్గెట్ అన‍్నట్లు మాటలతో కొట్లాడుకుంటున్నారు. అయితే హౌసులోని ఓ కంటెస్టెంట్‌పై.. బిగ్‌బాస్ విజేత అయిన రాహుల్ సిప్లిగంజ్.. ఓ సీరియస్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది వైరల్‌గా మారింది.

ఏం జరిగింది?
తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్నాడు. అద్భుతమైన ఆటతీరుతో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం సీజన్‌లో నటి రతిక.. ఓ కంటెస్టెంట్‌గా వచ్చింది. పర్లేదు అనిపించేలా ఆడుతోంది. ఈమె-రాహుల్ గతంలో ప్రేమించుకున్నారని, పెళ్లికి రెడీ అయిన వీళ్లు కొన్ని కారణాలతో విడిపోయారని సమాచారం. 

(ఇదీ చదవండి: ప్రిన్స్ ముఖంపై పేడ.. బక్వాస్ రీజన్ అని శోభా సీరియస్)

తొలివారం హౌసులో బాయ్ ఫ్రెండ్ ని తలుచుకుని కాస్త బాధపడ్డ రతిక.. మంగళవారం ఎపిసోడ్‌లోనూ తన మాజీ ప్రియుడు పేరు ఎత్తకుండా అతడి గురించి మాట్లాడుకుంటున్నారని శివాజీ దగ్గరకొచ్చి కాస్త బాధపడింది. అయితే రతిక ఇలా చేయడంపై.. ఆమె పేరు ఎత్తకుండా రాహుల్.. ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టాడు. అదంతా పరోక్షంగా రతిక గురించే అని డౌట్ వస్తుంది.

స్టోరీలో ఏముంది?
'ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ఎప్పుడూ అందరూ సొంత టాలెంట్‌తోనే పైకి రావాలనుకుంటారు. కొందరు మాత్రం పక్కనోళ్ల పేరు, ఫేమ్ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. గుర్తింపు రావడం కోసం నా పేరు అవసరం కంటే ఎక్కువ వాడుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్ టూ ఇన్నర్ పర్సన్. కంగ్రాచ్యూలేషన్స్ టూ వాళ్ల పైసల్ తీసుకున్న టీమ్' అని రాహుల్ ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. దీంతో ఈ స్టోరీ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

(ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవి పెళ్లి రూమర్స్.. అసలేం జరిగింది?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement