Bigg Boss 6 Telugu: Neha Chowdary Married To Her Friend, Wedding Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6:గ్రాండ్‌గా బిగ్‌బాస్‌ భామ నేహా చౌదరి పెళ్లి, ఫోటో వైరల్‌

Dec 19 2022 12:24 PM | Updated on Dec 19 2022 1:10 PM

Bigg Boss 6 Telugu: Neha Chowdary Married to her Friend - Sakshi

ఈ గ్రాండ్‌ ఫినాలే వీరిద్దరికే కాదు నేహా చౌదరికి కూడా జీవితాంతం గుర్తుండిపోనుంది.

కారణం.. అదే రోజు రాత్రి ఆమె పెళ్లి జరిగింది.

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ గ్రాండ్‌గా ముగిసింది. 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో రోహిత్‌, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్‌, రేవంత్‌ ఫినాలేకు చేరుకోగా రేవంత్‌ విజేతగా అవతరించాడు. రూ.40 లక్షలు తీసుకుని శ్రీహాన్‌ రన్నరప్‌గా నిలిచాడు. అయితే ప్రేక్షకుల ఓట్లు శ్రీహాన్‌కు ఎక్కువ వచ్చాయని, కానీ అతడు బ్రీఫ్‌కేస్‌ తీసుకోవడంతో రేవంత్‌ టైటిల్‌ గెలిచాడని ప్రకటించాడు నాగ్‌. ఇకపోతే ఈ గ్రాండ్‌ ఫినాలే వీరిద్దరికే కాదు నేహా చౌదరికి కూడా జీవితాంతం గుర్తుండిపోనుంది.

కారణం.. అదే రోజు రాత్రి ఆమె పెళ్లి జరిగింది. తనను పెళ్లి కూతురిని చేసిన తర్వాత గ్రాండ్‌ ఫినాలే వచ్చిన నేహా షో అయిపోగానే అందరూ మండపానికి వచ్చి ఆశీర్వదించండని కోరింది. ఆదివారం రాత్రి పది గంటలకు ఆమె వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. నూతన వధూవరులతో వీరు దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: విన్నర్‌ కంటే ఎక్కువ గెల్చుకున్న శ్రీహాన్‌, ఎన్ని లక్షలంటే?
28 సీజన్లలో మొట్టమొదటిసారి.. బిగ్‌బాస్‌ షోలో ఇద్దరు విన్నర్స్‌

Advertisement
 
Advertisement
Advertisement