Bigg Boss Telugu 6 Grand Finale Updates: Shrihan Took Golden Briefcase Worth Rs 40 Lakhs, Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu RunnerUp: గోల్డెన్‌ బ్రీఫ్‌కేస్‌ అందుకున్న శ్రీహాన్‌.. ఎన్ని లక్షలు గెలుచుకున్నాడంటే?

Dec 18 2022 10:01 PM | Updated on Dec 21 2022 6:11 PM

Bigg Boss Telugu 6 Grand Finale: Shrihan Took Golden Briefcase - Sakshi

నాగార్జున గోల్డెన్‌ బ్రీఫ్‌కేసుతో హౌస్‌లోకి వెళ్లాడు. రూ.25 లక్షలున్న బ్రీఫ్‌కేసును ఎవరు సొంతం చేసుకుంటారని అడిగాడు. ఇద్దరూ వద్దనేసరికి ఆఫర్‌ను రూ.30 లక్షలకు పెంచాడు.

బ్రీఫ్‌కేస్‌... బిగ్‌బాస్‌ షో ఫినాలేలో ఇంట్రస్టింగ్‌ అంకం అది. గత సీజన్లలో ఓడిపోయి వట్టి చేతులతో వెళ్లేబదులు సూట్‌కేస్‌ అందుకుని హౌస్‌ నుంచి సంతృప్తిగా బయటకు వచ్చేసినవాళ్లు ఉన్నారు. మరి ఈ సీజన్‌లో ఎవరైనా సూట్‌కేసు అందుకుంటారా? అంటే డౌటే అన్న అనుమానం వ్యక్తమైంది.

హౌస్‌లో టాప్‌ 3 కంటెస్టెంట్లు మిగిలినప్పుడు రవితేజ సూట్‌కేస్‌ పట్టుకుని వెళ్లాడు. మొదట ప్రైజ్‌మనీలో నుంచి పది శాతం ఇస్తానని తర్వాత దాన్ని 30 శాతం వరకు తీసుకెళ్లాడు. అయినా సరే ఎవరూ దాన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. కీర్తిని ఆమె ఫ్రెండ్‌ డబ్బులు తీసుకోమని చెప్పినా ఆమె వద్దని తలాడించి చివరికి ఖాళీ చేతులతో బయటకు వచ్చేసింది. తర్వాత శ్రీహాన్‌, రేవంత్‌.. ఇద్దరు మాత్రమే మిగిలారు. 

దీంతో నాగార్జున గోల్డెన్‌ బ్రీఫ్‌కేసుతో హౌస్‌లోకి వెళ్లాడు. రూ.25 లక్షలున్న బ్రీఫ్‌కేసును ఎవరు సొంతం చేసుకుంటారని అడిగాడు. ఇద్దరూ వద్దనేసరికి ఆఫర్‌ను రూ.30 లక్షలకు పెంచాడు. ఆరోహి, కీర్తి, అభినయ, మెరీనా, రోహిత్‌, సుదీప మినహా మిగతా అందరూ శ్రీహాన్‌ సూట్‌కేసు తీసుకోవడమే మంచిదని చెప్పారు. అందరి అభిప్రాయం అడిగిన తర్వాత ఇద్దరూ సూట్‌కేసు తీసుకోవడానికి ససేమీరా అన్నారు. దీంతో నాగ్‌ ఆ డబ్బును రూ.40 లక్షలకు పెంచాడు. మొదట్లో సూట్‌కేసు తీసుకోవద్దన్న శ్రీహాన్‌ తండ్రి చివరికి తీసుకోమని చెప్పాడు. తండ్రి మాట విన్నాక శ్రీహాన్‌ అమ్మానాన్న కోసం తీసుకుంటున్నానన్నాడు. అలా రన్నరప్‌గా శ్రీహాన్‌ రూ.40 లక్షలు గెల్చుకోగా, విన్నర్‌ రేవంత్‌కు కేవలం రూ.10 లక్షలు మాత్రమే మిగిలాయి.

చదవండి: ఆ ముగ్గురి కంటే ముందే ఎలిమినేట్‌ అయినందుకు హ్యాపీ: ఆదిరెడ్డి
మరికొద్ది గంటల్లో పెళ్లి.. పెళ్లికూతురి గెటప్‌లో ఫినాలేకు వచ్చిన నేహా చౌదరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement