Bigg Boss 6 Telugu Today Latest Promo: Nagarjuna Fires On Adireddy In Weekend Episode - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Latest Promo: ఏం పీకావ్‌..కెప్టెన్‌ ఆదిరెడ్డిపై నాగార్జున ఫైర్‌

Oct 1 2022 2:20 PM | Updated on Oct 1 2022 3:47 PM

Bigg Boss 6 Telugu Latest Promo: Nagarjuna Fires On Adireddy - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌కి శనివారం నాగార్జున గట్టి క్లాస్‌ తీసుకున్నట్లు ఉన్నాడు. ఈ వారమంతా ఇంటి సభ్యులు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ఒక్కొక్కరి ఆటతీరు ఎలా ఉందో చెప్పాడు. అయితే గేమ్‌ పరంగా తప్పిదాలు చేసిన వారిపై కౌంటర్లు వేసి కామ్‌గా ఉన్న నాగార్జున.. ఆర్జే సూర్య, ఆదిరెడివ్డలపై మాత్రం ఫైర్‌ అయ్యాడు.  ఆరోహితో గొడవపడిన సూర్య.. తినే ఫుడ్‌ని డస్ట్‌ బిన్‌లో పడేశాడు.

ఇదే విషయాన్ని నాగార్జున ప్రస్తావిస్తూ.. ఫుడ్ అంటే దేవుడితో సమానం కదా? నువ్వు పారేసిన అన్నం లేకుండా జీవితంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? అంటూ సూర్యకు చీవాట్లు పెట్టాడు. ఇదే విషయంపై ఆదిరెడ్డిపై కూడా ఫైర్‌ అయ్యాడు. ‘ఫుడ్‌ విషయంలో ఎవరికి పనిష్మెంట్‌ ఇవ్వను. ఎందుకంటే బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరికి తక్కువ ఫుడ్‌ ఉంది’అని మాకు చెప్పావ్‌ కదా..మరి సూర్య అలా చేస్తే నువ్వు ఏం పీకావ్‌ అంటూ ఆదిరెడ్డిని ఏసుకున్నాడు.  ఇక బాలాదిత్య వల్ల గీతూ ఏడ్వడం, శ్రీసత్య వల్ల అర్జున్‌ జైలుకు వెళ్లడంపై నాగార్జున చాలా ఫన్నీగా స్పందించారు.

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement