'తొక్క'లో పంచాయితీ.. ఎంత చెప్పినా గీతూ వినదే..! | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: 'తొక్క'లో లొల్లి.. మంచి చెప్పినా కేర్‌ చేయని గీతూ

Published Fri, Oct 28 2022 3:42 PM

Bigg Boss 6 Telugu: Clash Between Baladitya and Geetu Royal - Sakshi

సీతయ్య.. ఎవ్వరి మాటా వినడు అన్నట్లు ప్రవర్తిస్తోంది గీతూ రాయల్‌. మొన్నటివరకు బాలాదిత్యను అన్న అని పిలుస్తూ అతడితో సఖ్యతగా మెసులుకున్న గీతూ రానురానూ అతడిని టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోంది. నామినేట్‌ చేయడం, అతడిని గేమ్‌ నుంచి తప్పించడం, అసలు అతడేం బాగా ఆడలేదని కావాలని నెగెటివిటీ స్ప్రెడ్‌ చేయడం చూస్తుంటే అతడి మీద కక్ష పెట్టుకున్నట్లే కనిపిస్తోంది. మరోపక్క బాలాదిత్య మాత్రం ఒక్కసారి చెల్లి అన్నందుకు ఇప్పటికీ అదే బంధుత్వానికి కట్టుబడి ఉన్నట్లున్నాడు. గీతూ కసురుకున్నా, విసుకున్నా, నోరు జారినా అతడు మాత్రం తనకు మంచి చెప్పడానికే ప్రయత్నిస్తున్నాడు.

తాజాగా రిలీజైన ప్రోమోలో కూరగాయలు కట్‌ చేసినప్పుడు అదే చేత్తో తొక్కలు డస్ట్‌ బిన్‌లో వేయండి అని గీతూకు చెప్పాడు బాలాదిత్య. ఆమె మాత్రం నేను వేయను అని ముక్కుసూటిగా చెప్పేసింది. వేస్తే మంచిదానివి అవుతావుగా అంటే కూడా నేను మంచిదాన్నే కాదు అని వాదించింది. నీ మాటతీరుతో, చేతలతో పెంట చేసుకుంటున్నావని అతడు హెచ్చరించినా, నేను పెంట చేసుకుంటే నేనే పోతా, హ్యాపీగా ఉండు అని సమాధానమిచ్చింది. నువ్వు పోతే నేను హ్యాపీగా ఉండను, నువ్వు బాగుపడితే సంతోషంగా ఉంటానని కౌంటరిచ్చాడు ఆదిత్య.

చదవండి: పూరీ జగన్నాథ్‌ ఇంటికి పోలీసుల భద్రత
రామ్‌ సినిమాలో ఊర్వశి రౌతేలా? ఇదిగో క్లారిటీ

Advertisement
 
Advertisement
 
Advertisement