Bigg Boss 6 Telugu Episode 59 Highlights:Baladitya Fires On Geethu - Sakshi
Sakshi News home page

Bigg Boss 6: సిగరెట్ కోసం ఇంత అవమానిస్తావా..సిగ్గుండాలి..గీతూపై బాలాదిత్య ఫైర్‌

Nov 2 2022 10:32 AM | Updated on Nov 3 2022 8:31 AM

Bigg Boss 6 Telugu: Baladitya Fires On Geethu,Episode 59 Heights - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారం కెప్టెన్సీ​ కంటెండర్ల టాస్క్‌ ‘మిషన్‌ పాజిబుల్‌’ రసవత్తరంగా సాగింది. ఈ టాస్క్‌ కోసం ఇంటి సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోయారు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా, కీర్తి రెడ్ టీమ్‌గా ఉంటే.. ఆదిరెడ్డి, రాజ్‌, ఇనయా, వాసంతి, రోహిత్‌, మెరినా, బాలాదిత్య బ్లూ టీమ్‌గా ఉన్నారు. ఒక టీమ్‌లోని సభ్యులను మరో టీమ్‌ సభ్యులు హత్య చేయాలి. దాని కోసం తమ ప్రత్యర్థి టీమ్‌ సభ్యుల భుజాలపై ఉన్న నాలుగు స్ట్రిప్పులను లాగేయాలి. చనిపోయిన సభ్యులు దెయ్యం అవుతారు.

అయితే ఈ టాస్క్‌లో భుజ బలం మాత్రమే కాదు బుద్ది బలం కూడా చూపించాలి అని బిగ్‌బాస్‌ చెప్పడంతో గీతూ రెచ్చిపోయింది. బాలాదిత్య వీక్‌నెస్‌తో ఆడుకునేందుకు గీతూ-శ్రీసత్య-శ్రీహాన్‌ స్కెచ్ వేశారు. బాలాదిత్య సిగిరెట్లు, లైటర్‌ దాచేసి అతని వీక్‌నెస్‌ మీద దెబ్బకొట్టారు.  అవి కావాలంటే నాలుగు స్ట్రిప్పులు కావాలని అడిగింది గీతూ. దీంతో బాలాదిత్య ఎమోషన్ అయిపోయాడు. 'ఆఫ్ట్రాల్ సిగరెట్ కోసం.. ఎంత దిగజారుతున్నావో నీకు తెలుసా? నన్ను ఇంత దారుణంగా అవమానిస్తావా? సిగ్గుండాలి’ అంటూ బాలాదిత్య ఫైర్‌ అయ్యాడు.

ప్రపంచం మొత్తం దాన్ని నమ్మొద్దు అని చెప్పినా నేను వినలేదు. దాన్ని బంగారం అని మాట్లాడాను.. కానీ నా ఎమోషన్స్‌తో ఆడుకుంటుంది' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినప్పటికీ గీతూ మాత్రం సిగరేట్‌, లైటర్‌ ఇవ్వలేదు. మాటకు మాట సమాధానం ఇస్తూ.. గట్టిగానే ఉంది. సిగరేట్‌ కోసం సిగ్గుండాలి అంటాడా అంటూ ఆదిరెడ్డితో చెబుతూ బాధపడింది. ఈ టాస్క్‌ సగంలో ఉండగానే..  నిన్నటి ఎపిసోడ్‌ ముగిసింది. మరి ఈ ‘మిషన్‌ పాజిబుల్‌’టాస్క్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement