Bigg Boss 5 Telugu: సోహైల్‌తో సీక్రెట్‌లో రూంలో లేవా..! అరియానను ప్రశ్నించిన జెస్సీ

Bigg Boss 5 Telugu: Model Jessie Shocking Comments On Shanmukh Jaswanth - Sakshi

Bigg Boss 5 Telugu Jessie Shocking Comments On Shanmukh Jaswanth: బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి జెస్సీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.  అనారోగ్యం వెంటాడ‌టంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి త‌ప్పుకోక త‌ప్ప‌లేదు. సీక్రెట్ రూమ్‌లో పెడితే త‌న‌ను తిరిగి హౌస్‌లోకి పంపిస్తారేమోన‌ని వేయి క‌ళ్ల‌తో ఎదురు చూసిన జెస్సీ నిరాశే ఎదురైంది. అయితే జెస్సీ వెళ్లిపోయేముందు కంటెస్టెంట్ల‌కు పలు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చాడు. కాజల్‌కు అందరిని నమ్మకు నీ ఆట నువ్వు ఆడు అంటూ హెచ్చరించాడు. హౌజ్‌ వీడాకా బిగ్‌బాస్‌ బజ్‌లో అరియాన గ్లోరీతో ముచ్చటించాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను విడులైంది. ఈ సందర్భంగా జెస్సీ తన విశ్వరూపం చూపించాడు. హౌజ్‌లో పిల్లాడిలా ఉన్న జెస్సీ బయటకు వచ్చాక మిస్టర్‌ మజ్నుగా మారాడు. 

చదవండి: మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్‌ ఎంట్రీ!

ఇక సిరి, శ్వేత‌లో ఎవ‌రు నీకు ఇష్టం అని అరియానా ప్ర‌శ్నిస్తే.. ఇద్ద‌రు క‌లిసొస్తే బావుంటుంద‌ని జెస్సీ అన్నాడు. ఇక అరియాన తనదైనశైలో పంచ్‌ వేయడంతో ఆమెకు కూడా కూడా ఐ ల‌వ్ యూ చెప్పేశాడు. ఈ నేపథ్యంలో సిరిని చూడ‌గానే తెలియ‌ని క్ర‌ష్ ఏర్ప‌డిందా? అని అరియాన ప్రశ్నించగా షాకింగ్‌ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సిరి, ష‌ణ్నుల గురించి మాట్లాడుతూ.. షణ్నుని సిరి భ‌రిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ముగ్గురం టీంగా ఉన్నప్పటికీ  ష‌ణ్ను ఏదైన త‌ప్పు చేసినా తామే అత‌ని ద‌గ్గర‌కు వెళ్లి సారీ చెప్పేవాళ్ల‌మ‌న్నాడు. ఇదిలా ఉంటే హౌజ్‌లో అమ్మాయిల ప్రస్తావన రాగానే జెస్సీ ప్లేబాయ్‌లా మాట్లాడటం మొదలు పెట్టాడు.

చదవండి: నిన్ను వాడుకుంటున్నారు, జాగ్ర‌త్త‌: జెస్సీ హెచ్చ‌రిక‌

దీంతో అస‌లు ఏ అమ్మాయిని వ‌ద‌ల‌వా అని అరియానా అడిగితే, సీక్రెట్ రూమ్‌లో ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా అమ్మాయిని పంపుతారని ఎదురుచూశాన‌ని. కానీ బిగ్‌బాస్ ఎవ‌రినీ పంప‌లేదన్నాడు. రూంలో ఒక్కడినే ఉన్నా అనడంతో అరియాన అలా అంటుంటే చంఢాలంగా ఉందనడంతో..  నువ్వు సోహైల్ మాత్రం సీక్రెట్ రూమ్‌లో ఉండ‌లేదా? అని ఎదురు ప్ర‌శ్నించాడు. ఆ మాటతో అరియాన కామ్‌ అయిపోయింది. బాబోయ్‌ ఎక్కువ మాట్లాడితే నా సీక్రెట్స్‌యే బ‌య‌ట‌కు పడేలా ఉన్నాయంటూ వెనక్కి తగ్గింది.  ప్రొమో చూస్తుంటే ప్రతి సారి అరియాన అందరిని ఆడుకుంటే ఈ సారి జెస్సీ అరియానను ఆడుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రోగ్రామ్ చివ‌ర‌ల్లో ఏదీ ఎడిట్ చేయ‌కండ‌ని, అది ఎడిట్ చేస్తే చంపేస్తాన‌ని అరియానా వార్నింగ్ ఇవ్వ‌డం కొస మెరుపు. 

చదవండి: కేబీఆర్‌ పార్క్‌ వద్ద నటిపై దాడి.. ముఖంపై పిడిగుద్దులు, హత్యాయత్నం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top