Bigg Boss Telugu 5: ఆ న‌లుగురు టాప్ 5లో ఉంటార‌న్న జెస్సీ

Bigg Boss 5 Telugu: Eliminated Contestant Jessie Opinion About Housemates - Sakshi

Bigg Boss 5 Telugu, 10th Week Jessie Eliminated: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అంటే ఇదేనేమో! అదృష్టం బాగుండి నామినేష‌న్‌లో లేక‌పోయినా అనారోగ్యం వెంటాడ‌టంతో జెస్సీ బిగ్‌బాస్ షో నుంచి త‌ప్పుకోక త‌ప్ప‌లేదు. సీక్రెట్ రూమ్‌లో పెడితే త‌న‌ను తిరిగి హౌస్‌లోకి పంపిస్తారేమోన‌ని వేయి క‌ళ్ల‌తో ఎదురు చూసిన జెస్సీ ఆశ‌లు అడియాశ‌లే అయ్యాయి. బిగ్‌బాస్ హౌస్‌లో నీ జ‌ర్నీ పూర్తైంద‌ని పంపించివేశారు. అయితే వెళ్లిపోయేముందు జెస్సీ కంటెస్టెంట్ల‌కు విలువైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చాడు. ల్యాండ్‌ఫోన్ ద్వారా ఒక్కొక్క‌రితో ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడే అవ‌కాశం క‌ల్పించాడు బిగ్‌బాస్‌.

ముందుగా జెస్సీ.. స‌న్నీతో మాట్లాడుతూ.. 'జాగ్ర‌త్త‌గా ఉండు, టెంప‌ర్ లూజ్ అవ‌కు. ఒక్క‌డిగా గేమ్ ఆడితే ఇండివిడ్యువ‌ల్ హీరో అవుతావు, లేదంటే క‌మెడియ‌న్ అవుతావు' అని ఒక‌ర‌కంగా వార్నింగ్ ఇచ్చాడు. త‌ర్వాత మాన‌స్‌తో మాట్లాడుతూ.. 'నువ్వు సైలెంట్ కిల్ల‌ర్‌. ర‌వికే బాబువి నువ్వు, ఒప్పుకోవు కానీ ఇదే నిజం. నీ ఐడియాస్ బాగున్నాయ్ కానీ అంద‌రినీ నెగెటివ్‌గా చూడ‌కు' అని సూచించాడు. కాజ‌ల్‌తో.. 'నీ గేమ్ ఏమైంది? నువ్వు ప‌క్క‌వాళ్ల‌ను హైలైట్ చేయ‌డానికి రాలేదు. నీ ఫ్రెండ్స్ నీకు వాల్యూ ఇస్తున్నార‌నుకుంటున్నావు, కానీ ఇవ్వ‌ట్లేదు. నిన్ను వాడుకుంటున్నారు అది తెలుసుకో' అని హెచ్చ‌రించాడు.

యానీ మాస్ట‌ర్‌ గేమ్ బాగుంద‌న్న జెస్సీ ప్రియాంక సింగ్‌ను త్యాగాలు ఆపేయ‌మ‌ని హిత‌వు ప‌లికాడు. నీ గేమ్ ఇదేనా? అని నిల‌దీశాడు. 'త‌ర్వాత సీజ‌న్‌లో వ‌చ్చేవాళ్లు నిన్ను చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి, అంతేకానీ అబ్బో, అది 10 వారాలు ఎలా ఉంది? అని చుల‌క‌న‌చేయొద్దు' అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. దేనిలో ఇన్వాల్వ్ అవ‌ని శ్రీరామ్ టాప్ 5లో ఉంటాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ర‌వితో ఫోన్‌లో ముచ్చ‌టిస్తూ.. ఇన్‌ఫ్లూయెన్స్ చేసినా కానీ నీ గేమ్ బాగుంటుంది. ఫైన‌ల్‌లో క‌లుస్తాన‌ని చెప్పాడు.

త‌ర్వాత సిరితో మాట్లాడుతూనే తిట్టుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఒక ప‌క్క తంతానంటూనే మ‌రోప‌క్క నీ ఫైటింగ్ బాగుంద‌ని మెచ్చుకున్నాడు. కానీ నీ గేమ్ నువ్వు ఆడ‌మ‌ని హెచ్చ‌రించాడు. త‌ర్వాత‌ కిస్సులు లేవా? అని అడ‌డ‌గ‌డంతో గాల్లోనే ముద్దులు పంపింది సిరి. చివ‌ర్లో వ‌చ్చేవారమే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌కు, ఫైన‌ల్‌దాకా అక్క‌డే ఉండ‌మ‌ని చెప్పాడు. ష‌ణ్ముఖ్‌తో మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ అయిపోయాడు జెస్సీ. 'హౌస్‌లో ఉన్న చివ‌రి రోజుల్లో నీతో ఉండ‌లేక‌పోయాన‌న్న‌దే నా బాధ. నేను ఎప్ప‌టికీ నీ సీక్రెట్ ఫ్రెండ్‌నే' అన్నాడు.

ఇక ష‌ణ్ను మాట్లాడుతూ.. 'నువ్వు ఫ‌స్ట్ వీక్‌లోనే వెళ్లిపోతావ‌నుకున్నారు, కానీ ప‌దో వారంలో ఒక‌రికి లైఫ్ ఇచ్చి వెళ్లిపోతున్నావ్‌.. అదిరా నా జెస్సీ' అని పొగిడేయ‌డంతో అంద‌రూ చ‌ప్ప‌ట్లు కొట్టారు. ఈ ఫోన్ సంభాష‌ణ‌ల్లో జెస్సీ.. సిరి, ష‌ణ్ను, శ్రీరామ్‌, ర‌వి టాప్ 5లో ఉంటార‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. త‌ర్వాత జెస్సీ భార‌మైన హృద‌యంతో అంద‌రి ద‌గ్గ‌రా వీడ్కోలు తీసుకున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top