Bigg Boss Telugu 5: ఆట నుంచి అవుట్‌, భారంగా వీడ్కోలు తీసుకున్న జెస్సీ

Bigg Boss 5 Telugu: Model Jessie Eliminated From BB Show - Sakshi

Bigg Boss Telugu 5, Episode 71, Jessie Exit From Show: బిగ్‌బాస్ షో ద్వారా గంగ‌వ్వ కొత్తింటి క‌ల నెర‌వేరింద‌న్న శుభ‌వార్త‌ను హౌస్‌మేట్స్‌కు తెలియ‌జేశాడు నాగార్జున‌. గంగ‌వ్వ ఇంటిని వీడియో ద్వారా హౌస్‌మేట్స్‌కు చూపించాడు. త‌ర్వాత ఇంటిస‌భ్యుల‌ను రెండు టీములుగా విభ‌జించి గేమ్స్ ఆడించాడు. టీమ్‌ Aలో ష‌ణ్ముఖ్, యానీ, ప్రియాంక‌, స‌న్నీ ఉండ‌గా మిగిలిన‌వారంతో టీమ్‌ Bలో ఉన్నారు. మాన‌స్ సంచాల‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు.

మొద‌టి గేమ్‌లో కంటెస్టెంట్లు డ్యాన్స్ చేస్తున్న క్ర‌మంలో నాగార్జున‌ ఫైర్‌, ఐస్‌, వాట‌ర్ అని ప‌లికిన‌ప్పుడు ఆయా బోర్డుల ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తుకెళ్లాలి. చివ‌ర‌గా బోర్డును చేరుకున్న వ్య‌క్తి ఓడిపోయిన‌ట్లు లెక్క‌! అంతేకాకుండా వారికి ప‌నిష్మెంట్ కూడా ఉంటుంది. అలా ఈ గేమ్‌లో నాగ్‌.. ర‌వితో గోడ‌కుర్చీ వేయించి, ష‌ణ్నును మోకాళ్ల మీద కూర్చోబెట్టి, సిరిని ఒంటికాలిపై, యానీని రెండు చేతులు పైకెట్టి నిల్చోబెట్టాడు. మొత్తంగా ఈ గేమ్‌లో A టీమ్‌లోని స‌న్నీ గెలిచాడు.


త‌ర్వాత గేమ్‌లో హీరోహీరోయిన్ల చిన్న‌నాటి ఫొటోలు చూపించ‌గా అది ఎవ‌రో గుర్తుప‌ట్టాల‌న్నాడు నాగ్‌. ఈ గేమ్‌లోనూ A టీమ్ విజయం సాధించింది. త‌ర్వాతి గేమ్‌లో కొన్ని ప‌దాలున్న మెడ‌ల్స్‌ను దానికి స‌రిగ్గా స‌రిపోయే వ్య‌క్తికి వేయాల‌న్నాడు. స‌న్నీ.. ఫేక్ అన్న మెడ‌ల్‌ను ర‌వికి వేశాడు. మాన‌స్‌.. ప్రియాంక త‌న‌కు త‌ల‌నొప్పిగా మారింద‌న్నాడు. శ్రీరామ్‌.. గేమ్‌లో కాజ‌ల్ క‌న్నింగ్ అని చెప్పాడు.

ర‌వి.. పొగ‌రుబోతు(యారోగెంట్‌) అన్న మెడ‌ల్‌ను యానీకి ఇచ్చాడు. ప్రియాంక సింగ్‌.. ష‌ణ్ముఖ్ సెల్ఫిష్ అని చెప్పింది. యానీ.. స‌న్నీ సెల్ఫిష్ అంది. కాజ‌ల్‌.. సిరి డ‌బుల్ ఫేస్ (రెండు నాలుక‌ల‌ పాము) అని తెలిపింది. సిరి.. ష‌ణ్ముఖ్ ప్ర‌తిసారి నేను వెళ్లిపోతానేమోన‌ని నెగెటివ్‌గా మాట్లాడుతాడ‌ని బుంగ‌మూతి పెట్టుకుంది.

త‌ర్వాత మాన‌స్‌, కాజ‌ల్ ఇద్ద‌రూ సేఫ్ అని ప్ర‌క‌టించిన నాగ్ మీ ఇద్ద‌రూ కాకుండా మ‌రొక హౌస్‌మేట్ వెళ్లిపోతున్నాడ‌ని చెప్పాడు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న‌ జెస్సీ ఆరోగ్యం బాగోలేనందున అత‌డిని పంపించివేయ‌క త‌ప్ప‌ద‌ని వెల్ల‌డించాడు. అలా మాన‌స్‌, కాజ‌ల్‌ల‌లో ఒక‌రికి బ‌దులుగా అస‌లు నామినేష‌న్‌లోనే లేని జెస్సీ ఆట నుంచి అర్ధాంత‌రంగా నిష్క్ర‌మించాడు. స్టేజీ మీద‌కు వ‌చ్చిన పిద‌ప‌ త‌న జ‌ర్నీ వీడియో చూసుకుని క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు. నిజానికి ప‌లు పోల్స్‌లో కాజ‌ల్ త‌క్కువ ఓట్ల‌తో చివ‌రి స్థానంలో ఉంది. ఆమె ఎలిమినేట్ అవ‌డం ఖాయం అనుకున్నారంతా! కానీ చివ‌ర‌కు జెస్సీని పంపించేయ‌డంతో ఆమెను సేవ్ చేసి లైఫ్ ఇచ్చిన‌ట్లైంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top