Bigg Boss 5 Telugu Contestant & Model Jessie Clarity On Rumors - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: 'బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడానికి డబ్బులిచ్చాడా?' రూమర్లపై జెస్సీ క్లారిటీ!

Dec 6 2021 10:04 PM | Updated on Dec 9 2021 4:40 PM

Bigg Boss 5 Telugu: Model Jessie Clarity On Rumours - Sakshi

రూపాయి విలువ కూడా నాకు తెలుసు. బిగ్‌బాస్‌ ఆఫర్‌ ఫ్రీగా వచ్చినా వెళ్దాం అనుకున్నాను. కానీ..

Bigg Boss 5 Telugu, Model Jaswanth Padala: తెలుగు బిగ్‌బాస్‌ షోలో ఎక్కువగా నటీనటులు, కమెడియన్లు, సింగర్లు, కొరియోగ్రాఫర్‌లు, యూట్యూబర్‌లే కనిపిస్తూ ఉంటారు. మోడల్స్‌ పాల్గొనడం అనేది చాలా తక్కువ. అయితే ఈ సీజన్‌లో మాత్రం మోడల్‌ జెశ్వంత్‌ షోలో ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అతడికి నిజంగానే బిగ్‌బాస్‌ నుంచి ఆఫర్‌ వచ్చిందా? లేదా అతడే బిగ్‌బాస్‌కు ఎదురు డబ్బులిచ్చి కంటెస్టెంట్‌గా వచ్చాడా? అన్న రూమర్లు వినిపించాయి. నిజానికి బిగ్‌బాస్‌ టీమ్‌ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు పారితోషికం ముట్టజెప్పుతుంది కానీ జెస్సీనే బిగ్‌బాస్‌ నిర్వాహకులకు డబ్బులిచ్చాడా? అని ఆ మధ్య సోషల్‌ మీడియాలో చర్చ జరిగింది. తాజాగా ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు జెస్సీ.

'బయట ఉన్నవాళ్లతో పాటు హౌస్‌లో ఉన్నవాళ్లు కూడా నేను బిగ్‌బాస్‌కు డబ్బులిచ్చి వచ్చానన్నారు. కానీ నేను బిగ్‌బాస్‌ వాళ్లకు డబ్బులివ్వడమేంటి? నా అకౌంట్‌లో రూ.11 వేలు మాత్రమే ఉన్నాయి. నేను ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. నాకు తండ్రి లేడు. రాత్రిళ్లు ఉద్యోగం చేసి ఆ డబ్బుతో మోడలింగ్‌ నేర్చుకుంటూ ఎదిగాను. రూపాయి విలువ కూడా నాకు తెలుసు. బిగ్‌బాస్‌ ఆఫర్‌ ఫ్రీగా వచ్చినా వెళ్దాం అనుకున్నాను. కానీ వాళ్లే నాకు డబ్బులిచ్చారు. అంతేకానీ వారికి ఎదురు డబ్బులిచ్చేంత స్థోమత లేదు. బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. ఆస్తిపాస్తులు అంతకన్నా లేవు. నేను బిగ్‌బాస్‌కు దొడ్డిదారిన రాలేదు. స్ట్రయిట్‌గా వెళ్లాను, స్ట్రయిట్‌గా ఆడాను' అని చెప్పుకొచ్చాడు జెస్సీ.

Advertisement
 
Advertisement
Advertisement