Big Boss 5 Latest Updates: Shanmukh gets a pleasant birthday surprise from deepthi sunaina - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ 5 తెలుగు: షణ్ముక్‌ బర్త్‌డే, హౌజ్‌ బయట దీప్తి రచ్చ

Sep 16 2021 2:20 PM | Updated on Sep 16 2021 4:11 PM

Bigg Boss 5 Telugu: Deepthi Sunaina Surprise Shanmukh Jaswanth Birthday - Sakshi

‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’, ‘సూర్య’ వెబ్‌సిరీస్‌లతో యూట్యూబర్‌ స్టార్‌గా ఎదిగిన షణ్ముక్‌ జస్వంత్‌ ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో  బిగ్‌బాస్‌ 5 తెలుగు సీజన్‌తో హౌజ్‌లోకి అడుగు పెట్టాడు. మొదటి వారం హౌజ్‌లో బిడియంగా ఉంటూ తనలోకంలో తానే  ఉన్న షణ్ముక్‌ రెండో​ వారం హౌజ్‌మేట్స్‌తో కలిసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ రోజు(గురువారం) షణ్ముక్‌ పుట్టిన రోజు సందర్భంగా హౌజ్‌లో సందడి వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా షణ్ముక్‌ ప్రియురాలు, బిగ్‌బాస్‌ మాజీ  కంటెస్టెంట్‌ దిప్తీ సునయన అతడికి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 

చదవండి: అమెరికాలో సేదతీరుతున్న జగపతి బాబు


దీప్తి వర్చువల్‌ ద్వారా అర్థరాత్రి షణ్ముక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినట్లు సోషల్‌ మీడియా పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. అంతేగాక తన స్నేహితులతో కలిసి బిగ్‌బాస్‌ హౌజ్‌ బయట టాపాసుల పెల్చీ వేడుకల చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీప్తితో పాటు వారి స్నేహితులు బిగ్‌బాస్‌ హౌజ్‌ బయటి నుంచి హ్యాపీ బర్త్‌డే షణ్ముక్‌ అంటూ గట్టిగా అరుస్తూ రచ్చ రచ్చ చేశా రు. 

చదవండి: ప్రభాస్‌-రాజమౌళి కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌?!

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement