బిగ్‌బాస్‌ 5: శ్రీరామ్‌ చంద్రకు షణ్ముఖ్‌ ప్రియురాలు దీప్తి మద్దతు | Bigg Boss 5 Telugu: Deepthi Sunaina And Priya Supports Sreeram Chandra | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 telugu: శ్రీరామ్‌ చంద్రకు షణ్ముఖ్‌ ప్రియురాలు దీప్తి మద్దతు

Dec 2 2021 8:33 PM | Updated on Dec 3 2021 9:21 AM

Bigg Boss 5 Telugu: Deepthi Sunaina And Priya Supports Sreeram Chandra - Sakshi

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్‌ మాత్రమే ఉన్నారు.  ఫినాలే టికెట్ సాధించడానికి ఇంటి సభ్యులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో వారికి దశల వారిగా టాస్కులు పెడుతున్నాడు బిగ్‏బాస్. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో పెట్టిన ఐస్ గేమ్‌తో ఇంటి సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఐస్ టబ్బులో కాళ్లు పెట్టి ఉండాలని.. మధ్యలో కాళ్లు బయటకు తీయవచ్చని సూచించాడు బిగ్‏బాస్. కానీ హౌస్మేట్స్ మొండితనంతో ఐస్‌లోనే కాళ్లు పెట్టి ఉంచడంతో చివరికి కాళ్లు కదపలేని స్థితికి చేరుకున్నారు.

చదవండి: టాలీవుడ్‌లో విషాదం, రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత మృతి

శ్రీరామచంద్ర, షణ్ముఖ్, సిరి కాళ్లు వాపులు వచ్చాయి. అయితే గేమ్ తర్వాత వెంటనే ఎవరు వేడి నీళ్లు ఉపయోగించకూడదని బిగ్‏బాస్ ముందుగానే హెచ్చరించాడు. కానీ అవేం పట్టించుకోకుండా ప్రియాంక.. శ్రీరామచంద్రకు సహయం చేయడానికి వచ్చి వేడి నీళ్లు అతడి కాళ్లపై చల్లింది. అంతేగాక నూనేతో మర్దన చేసింది. కాళ్లకు వేడినీళ్లు చల్లడంతో శ్రీరామచంద్ర పూర్తిగా నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. దీంతో అతడిని మెడికల్ రూంకు తీసుకెళ్లి .. కాళ్లకు కట్లు కట్టి పంపించాడు బిగ్‏బాస్.

చదవండి: వైరల్‌ అవుతోన్న కమెడియన్‌ రఘు షాకింగ్‌ వీడియో!

అనంతరం పవన్‌ కల్యాణ్‌ తీన్మార్‌ మూవీలోని ‘గెలుపు తలుపూలే తీసే..’ పాట ప్లే చేయడంతో శ్రీరామచంద్ర కన్నీరు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే శ్రీరామచంద్ర పరిస్థితి చూసి సన్నీ కూడా బాధపడ్డాడు. ఎప్పటికప్పుడు శ్రీరామచంద్రకు సహాయంగా ఉంటూ అతడిని నవ్విస్తున్నాడు. ఇక శ్రీరామచంద్ర పరిస్థితి చూసి ప్రేక్షకులకు సైతం కళ్లు చెమ్మగిల్లకమానవు. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అయిన శ్రీరామ్ పరిస్థితి చూసి బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టేంట్స్‌తో పాటు ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సైతం ఎమోషనల్ అవుతున్నారు.

చదవండి: థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్‌ రచ్చ, రంగంలోకి పోలీసులు

తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ నెటిజన్లతో పాటు కొందరూ సెలబ్రెటీలు ‘సంగీతం మాస్టర్‌’కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక షణ్ముఖ్‌ జశ్వంత్‌ ప్రియురాలు, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ దీప్తి సునయన శ్రీరామ్‌కు సపోర్ట్‌ ఇవ్వడం విశేషం. ‘మోర్‌ పవర్‌ టూ యూ’ అంటూ దిప్తీ, శ్రీరామ్‌కు మద్దతు ప్రకటించింది. అలాగే ప్రియ సైతం ఇన్‌స్టాలో స్టోరీ షేర్‌ చేస్తూ ‘ఇంట్లో జెన్యూన్ పర్సన్ , రామ్ నీకోసం మేమంతా ఉన్నాము.. ప్లే స్ట్రాంగ్.. నీకోసం ప్రార్థిస్తుంటాను త్వరగా కోలుకోవాలి’అని శ్రీరామ్‌కు అండగా నిలిచింది. వీరితో పాటు అఖిల్‌ సార్థక్‌, దేత్తడి హారికా, నోయల్‌ సైతం ‘మోర్‌ పవర్‌ టూ యూ.. గెట్‌ వెల్‌ సూన్‌’ అంటూ మద్దతు ఇస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement