Comedian Raghu Karumanchi Sales Liquor Video Goes Viral - Sakshi
Sakshi News home page

Raghu Karumanchi Video Viral: కమెడియన్‌ రఘు ఏం చేస్తున్నాడో తెలుసా?

Dec 2 2021 5:37 PM | Updated on Dec 3 2021 8:14 AM

Comedian Raghu Karumanchi Sales Liquor Video Goes Viral - Sakshi

Comedian Raghu Karumanchi Sales Liquor Video Goes Viral: తనదైన కామెడీతో ఇటూ వెండితెర, అటూ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్‌ రఘు కారుమంచి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా. కొంతకాలంగా తెరకు దూరమైన రఘు కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన రఘు షాకింగ్‌ వీడియో వైరల్‌ అవుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని పాటించడం ఎంత అవసరమో లాక్‌డౌన్‌లో చాలా మంది నటీనటులకు తెలిసోచ్చింది. ఇటూ అవకాశాలు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు క్యారెక్టర్‌ అర్టిస్టులు.

చదవండి: బాలయ్య ఫ్యాన్స్‌కు చేదు అనుభవం, థియేటర్లో అగ్ని ప్రమాదం

అయితే అలాంటి కోవలోకి రాకుండా రఘు ముందు జాగ్రత్త పడుతున్నాడు. అందుకే అది ఏ వ్యాపారం అని కూడా చూడకుండా తాజాగా లిక్కర్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేశాడు రఘు. సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన రఘు ‘అదుర్స్’ చిత్రంలో తనదైన కామెడీతో అందరిని మెప్పించాడు. అలా కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకొని సినిమాల్లో తన ప్రయాణం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ప్రముఖ కామెడీ షోలో రఘు పేరుతో టీం కూడా నడిపించాడు. కొద్ది రోజులకు ఆ షో నుంచి బయటకు వచ్చిన రఘు పూర్తిగా సినిమాలపై ఫోకస్‌ పెట్టాడు.

చదవండి: వెడ్డింగ్‌ యానివర్సరి, భర్త విషయంలో ప్రియాంక కీలక నిర్ణయం..

కరోనా కారణంగా అవకాశాలు లేకపోవడంతో లాక్‌డౌన్‌లో సొంతూరికి వెళ్లిన రఘు కూరగాయలు పండించాడు. అవి మంచి ఆదాయం తీసుకురావడంతో మరో పది ఎకరాల పొలం లీజుకు తీసుకొని భారీ స్థాయిలో కూరగాయలు పండించాడట. ఈ బిజినెస్‌లో మంచి లాభాలు రావడంతో ఆ డబ్బుతో లిక్కర్ బిజినెస్‌ మొదలు పెట్టాడట రఘు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో రఘుతో పాటు అతని ముగ్గురు స్నేహితులు కలిసి టెండర్స్ వేశారు. అందులో రెండు టెండర్స్ రఘు పేరు మీద వచ్చాయి.

చదవండి: కూకట్‌పల్లి మాల్‌లో సల్మాన్‌ సందడి, వీడియో వైరల్‌

దీంతో నల్గొండ పట్టణ శివారులో మర్రిగూడ బైపాస్‌ వద్ద రెండు దుకాణాలను రఘు దక్కించుకున్నాడు. ఇటీవలే ఈ షాపులను ఓపెన్ చేసి మద్యం అమ్మడం మొదలు పెట్టాడు. రఘు స్వయంగా షాప్‌లో ఉండి మద్యం అమ్ముతుండటంతో అక్కడికి వచ్చిన వాళ్ళు షాక్‌ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది రఘుతో సెల్ఫీ తీసుకోవడంతో పాటు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. అది చూసిన నెటిజన్లు అవకాశాలు లేకపోయిన లైఫ్‌ని బాగా సెట్ చేసుకున్నాడంటూ కామెంట్‌ చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement