Salman Khan: Visits Sujana Forum Mall At 4PM Over Antim Promotions At Kukatpally - Sakshi
Sakshi News home page

Salman Khan Visits Hyderabad: ఫోరం షాపింగ్‌ మాల్‌లో సల్మాన్‌ సందడి, హైదరాబాద్‌ చేరుకున్న ‘భాయిజాన్‌’

Dec 2 2021 2:39 PM | Updated on Dec 4 2021 4:37 PM

Salman Khan Visits Kukatpally Sujana Forum Mall At 4PM Over Antim Promotions - Sakshi

బాలీవుడ్‌ భాయిజాన్‌ సల్మాన్‌ ఖాన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ హీరో అయినప్పటికీ ఆయనకు తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడ ఇలా దేశ వ్యాప్తంగా ఎంతో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. తనదైన మ్యానరిజం, కండలతో లేడీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ఈ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ హైదరాబాద్‌లో దర్శనం ఇస్తే ఎలా ఉంటుంది. అది ఓ మాల్‌లో.. ఇంకేముందు హైదరాబాద్‌ ఫ్యాన్స్‌కు పండగే.

చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్‌ బాబు సోదరి ప్రియదర్శిని

ఈ బి-టౌన్‌ కండల వీరుడు కూకట్‌పల్లిలోని సుజన ఫోరం మాల్‌లో సందడి చేయబోతున్నాడు. తాజాగా ఆయన నటించిన అంథిమ్‌ మూవీ ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చాడు. ఇప్పటికే శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి సిటీలోకి ఎంటర్‌ అయిన సల్మాన్‌ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. సల్మాన్‌ను చూస్తూ ‘ఏక్‌ సెల్ఫీ’ అంటూ ఫ్యాన్స్‌ అంతా కేకలు పెడుతూ సల్మాన్‌పై అభిమానం ఒలకబోస్తున్నారు. ఈ వీడియోలను అభిమానులు తమ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేస్తూ ‘హైదరాబాద్‌లో మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హంక్‌ @సల్మాన్‌ ఖాన్‌’ అంటూ తెగ మురిసిపోతున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: సిరివెన్నెలకు ఆ పాటలంటే అసలు నచ్చదట, అవేంటో తెలుసా?

కాగా ఈ రోజు సుజన ఫోరం మాల్‌కు సల్మాన్‌ రాబోతున్నాడు అంటూ  పీవీఆర్‌ సినిమాస్‌ యాజమాన్యం కూడా వెల్లడించింది. పీవీఆర్‌ సినిమాస్‌ ‘ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఫోరం మాల్‌లో అంథిమ్‌ సినిమా చూసేందుకు సల్మాన్‌ రానున్నారు. ప్రతి ఒక్కరు టికెట్టు కొనుక్కొని సల్మాన్‌తో సినిమా చూసేందుకు సిద్దం అవ్వండి’ అంటూ ట్విటర్‌లో ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ‘భాయిజాన్‌’ హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ అంతా కుకట్‌పల్లి సుజన ఫోరం మాల్‌కు క్యూ కడుతున్నారు. సల్మాన్‌ రాకతో మాల్‌ అంతా సందడి వాతావరణం నెలకొననుంది. కాగా తన చిత్రం అంథిమ్‌ ప్రమోషన్‌లో భాగంగా సల్మాన్‌ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్‌ చేరుకున్నాడు. 

చదవండి: Salman Khan: చిరంజీవిగారు అడగ్గానే ఓకే చెప్పా!

Advertisement
 
Advertisement
Advertisement