Young Hero Sudheer Babu Wife Priyadarshini Files Complaint Over Rs 2.9 Crore Cheating Case: అధిక వడ్డి ఇప్పిస్తానంటూ ముగ్గురు టాలీవుడ్ హీరోలతో పాటు నగరానికి చెందిన ప్రముఖులను మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహరం సంచలనం రేపుతోంది. రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల మేర శిల్ప పలువురికి కుచ్చు టోపి పెట్టింది. దీంతో ఓ మహిళ చేతిలో అంత ఈ జీగా మోసపోయింది పేరున్న వ్యక్తులు, సెలబ్రెటీలు అని తెలిసి అందరూ షాకవుతున్నారు.
చదవండి: ఏపీ వరదలు: బాధితుల కోసం చిరంజీవి, మహేశ్, తారక్‌ల భారీ విరాళాలు

దివ్య రెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శిల్ప ఆమె భర్తను శనివారం (నవంబర్ 27) ఉదయం అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇక వారి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. రియల్ ఎస్టెట్ వ్యాపారం పేరుతో శిల్ప మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన 5 రోజుల తర్వాత ఓ అగ్ర హీరో సోదరి, యంగ్ హీరో భార్య మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు.
చదవండి: Cheating Case: సినీ సెలబ్రిటీలను రూ. 200 కోట్లు మోసం, రిమాండ్‌లో కీలక విషయాలు వెల్లడి

ఆమె ఎవరో కాదు సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి, యంగ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని. శిల్ప తన దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసిందంటూ బుధవారం(డిసెంబర్ 1) ప్రియదర్శని పోలీసులను ఆశ్రయించారు. తన వద్ద రూ. 2.9 కోట్లు తీసుకుని శిల్ప మోసం చేసినట్లు ఆమె మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసమే ఆమె ప్రతి వీకెండ్‌లో కిట్టి పార్టీ ఏర్పాటు చేసేదని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శిల్పను మరోసారి కస్టడిలోకి తీసుకుని డబ్బులు ఎక్కడికి తరలించారనే దానిపై విచారిస్తామని పోలీసులు తెలిపారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
