బిగ్‌బాస్‌ 5 తెలుగు: ప్రోమో వచ్చేసింది, సరికొత్తగా నాగ్‌ ఎంట్రీ

Bigg Boss 5 Telugu: Bigg Boss 5 Promo Release - Sakshi

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా స్టార్‌మా బిగ్‌బాస్ సీజ‌న్ 5 ప్రోమోను విడుద‌ల చేసింది. త్వ‌ర‌లోనే ఈ రియాలిటీ షో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే బిగ్ బాస్ 5 లోగోను విడుద‌ల చేసిన నిర్వహకులు హీరో నాగార్జున నటించిన బిగ్‌బాస్‌ 5 ప్రోమోను ప్రోమోను రిలీజ్ చేశారు. అంటే.. ఈ ప్రోమో చూస్తుంటే సారి కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు స్పష్టం అయ్యింది.

‘బోర్‌డ‌మ్‌కు చెప్పేయ్ గుడ్‌బై.. వ‌చ్చేసింది బిగ్‌బాస్‌ తెలుగు సీజ‌న్ 5’ అంటూ నాగార్జున సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. దీనితో మొదటి నుంచి ఈ సీజన్‌ హోస్ట్‌ ఎవరన్న దానిపై ఉన్న సస్పెన్స్‌కు ఈ ప్రోమోతో తెరపడింది. కాగా ఈ ప్రోమోలో నాగ్‌ అంద‌రితో చిందులేస్తూ చెప్పే మాట‌లు బుల్లితెర ప్రేక్ష‌కులను తెగ ఆకట్టుకుంటోంది. చెప్పాలంటే ఈ ప్రోమోతో బిగ్‌బాస్‌ను క్రేజ్‌ను మరింత పెంచేశాడు నాగ్‌.

కాగా ఈ ఏడాది షో ఉంటుందా లేదా అనే ఊహాగానాలకు చెక్‌ పెడుతూ నిర్వాహకులు బిగ్‌బాస్‌ సీజన్‌ 5 లోగోను విడుదల చేసిన సంగతి తెలిసందే. ఇదిలా ఉండగా ఎప్పటిలాగే ఈ సారి కూడా బిగ్‌బాస్‌ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్‌ మీడియాలో ఓ లిస్ట్‌ చక్కర్లు కొడుతోంది. అందులో యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో,సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరి పేర్లు దాదాపు ఖాయమే అని తెలుస్తుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top